పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ.46,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 పెరిగి రూ.50,400కి చేరింది. ఇక నిన్నటి రోజున భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి. ఇక ఈరోజు కూడా అదే విధంగా వెండి ధరలు పైకి కదిలాయి. ఏకంగా కిలో వెండి ధర రూ.1000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 68,900కి చేరింది.