కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలో ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. అలాగే ఈ కొత్తిమీర ను  ఇంటి పెరట్లో బాల్కనీలో కుండీలలో ఈజీ గా పెంచుకోవచ్చు. అలాంటి కొత్తిమీర కీ కేవలం రుచి పెంచడమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.



హైబీపీ తో బాధ పడుతున్న వారికి కొత్తిమీర సలాడ్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటివి వచ్చే రిస్క్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది. కొత్తిమీర ఆకులు వికారానికీ, అజీర్ణ సమస్యలకీ మంచి విరుగుడు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో అరగడానికి హెల్ప్ చేసే డైజెస్టివ్ జ్యూసులు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.కొత్తిమీర కి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ లో ఒకటి షార్ప్ ఐ సైట్. కొత్తిమీర లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ఫరస్ విజన్ డిసార్డర్స్ ని ప్రివెంట్ చేస్తాయి. కంటి మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరొటిన్ వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే డీజెనరేటివ్ ఎఫెక్ట్స్ ని కొత్తిమీర రివర్స్ చేయగలదు.


కండ్ల కలక రాకుండా ప్రివెంట్ చేస్తుంది.టూత్‌పేస్ట్ కనుక్కోక ముందు ప్రజలు నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి ధనియాలు నమిలేవారని మీకు తెలుసా? యాంటీ సెప్టిక్ టూత్ పేస్ట్స్ లో తప్పని సరిగా కొత్తిమీర ఉంటుంది. అలాగే, కొత్తిమీర నోటి పుళ్ళని కూడా పోగొడుతుంది. ఆస్తియోపొరాసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని కొత్తిమీర తీసుకోమని చెబుతారు. ఎముకలు బలంగా, ఆరోగ్యం గా ఉండాలని కోరుకునే వారందరూ కొత్తిమీరని వారి రోజువారీ ఆహారంలో తప్పని సరిగా భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే కాల్షియం, ఇంకా ఇతర మినరల్స్, బోన్ డిగ్రడేషన్ ని ప్రివెంట్ చేస్తాయి, బోన్ రీగ్రోత్ కి హెల్ప్ చేస్తాయి.ధనియాల్లో ఎసోర్బిక్ యాసిడ్, పామిటిక్ ఆసిడ్, లైనోలిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి హార్మోన్స్ సరిగ్గా పని చేసేలా చూస్తాయి. ఇందు వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా ఉండడమే కాక పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది.


రాత్రంతా ధనియాలు నీటిలో నానబెట్టి పొద్దున్నే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.కొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ ని ప్రివెంట్ చేస్తాయి. రెగ్యులర్ గా కొత్తిమీర తీసుకోవడం వల్ల కాన్సర్, అల్జైమర్స్, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ బాగా రెడ్యూస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: