ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఆరోగ్య కరమైన పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవన శైలి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మొలకెత్తిన విత్తనాలు శరీరానికి కావలసినటువంటి పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి. అలాగే వీటిని తయారు చేసుకోవడం సులభం కూడా... మరియు ఖర్చు కూడా తక్కువే. అందుకే చాలా మంది ఈ మధ్య కాలంలో తమ ఆహారంలో మొలకెత్తిన విత్తనాలకు ఒక భాగం చేసుకున్నారు. అయితే మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకునే సమయంలో ఈ ఒక్క విషయం మరిచిపోతూ ఉంటారు. అయితే ఆ విషయం ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.

మొలకెత్తిన విత్తనాలు తినే టైం కూడా కొంత మందికి ఉండదు, ఎందుకంటే వాటిని నమిలి తినడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది, అందుకే వాటిని హ్యాపీ జ్యూస్ చేసి తాగేస్తున్నారు. అయితే ఇలా చేయడం వలన వాటి లోని పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందవు. వాటిని నమలటం వలన నోటిలో ఊరే లాలాజలం వాటితో కలిసి శరీరంలోకి వెళ్లి ఆ విత్తనాలలోని కార్బోహైడ్రేట్స్ ను పూర్తి స్థాయిలో జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. ఒకవేళ మీరు కనుక జ్యూస్ చేసుకుని తాగినట్లైతే లాలాజలం ఊరక ఆ విత్తనాలలో ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతంత మాత్రంగా జీర్ణం అయ్యి తక్కువ పోషకాలను మాత్రమే శరీరానికి అందిస్తాయి.

అదే విధంగా వీటిని అలాగే తినాలి అంటే చాలా మందికి అంతగా సహించవు. అలాంటప్పుడు వీటితో పాటుగా కొన్ని  ఖర్జూర, దానిమ్మ గింజలు, ఎండు ద్రాక్ష, లేదా ఉల్లి పాయ ముక్కలు వేసుకుని తినడం వల్ల రుచి కొద్దిగా పెరిగి తినాలనిపిస్తుంది. లేదంటే కాస్త తేనె కానీ నిమ్మరసం కానీ వేసుకోవచ్చు. మొలకెత్తిన విత్తనాలను మీ  భోజనంతో పాటుగా తీసుకోకుండా వీటినే ఒక పూట భోజనం తీసుకోవడం మరింత ఉత్తమం .

మరింత సమాచారం తెలుసుకోండి: