మాయదారి మల్లిగాడు పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఈ మహమ్మారి కరోనా వైరస్ ఉనికి మానవాళికి ముప్పుగా మారింది. ఈ మాయలేడి వచ్చిన వేళా విశేషం దీని వలన మనం పడిన తిప్పలు, వచ్చిన సమస్యలు అన్ని ఇన్ని కావు. దాదాపు మూడేళ్ళ పాటు చిన్న పెద్ద, పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషికి నరకం అంటే ఎలా ఉంటుందో ఈ భూమి మీదే రుచి చూపించేసింది. నేటికీ ఈ వైరస్ ఈ నేలను వీడి వెళ్లకుండా అందరినీ బాదిస్తోంది. దీన్ని నుండి ఎలాగోలా బయటపడ్డాం దేవుడా అనుకునే లోపు కొందరిలో వస్తున్న ఆరోగ్య సమస్యలు చూసి బయపడాల్సి వస్తోంది.

ఈ వైరస్ ఒక్కసారి వచ్చి వెళ్ళింది అంటే మన ఈ శరీరం పై బాగా ప్రభావం పడటం చేత శరీర అవయవాలు దెబ్బతింటున్నాయని కొన్ని పాట్స్ నెమ్మదిగా పాడవుతున్నాయని వార్తలు వింటూనే ఉన్నాం. అందుకే ఇలాంటి నష్టాల నుండి మనము బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముంబైలో ఇద్దరికి సోకిందని తెలిసిన విషయమే. ఈ కేసుల గురించి తెల్సిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ముందు నుండి వైద్యులు చెబుతున్న ప్రకారం రానున్న జూన్ నెలలో కరోనా మళ్ళీ సోకుతుందని ఇది చాలా వేగంగా ఒకరి నుండి మరొకరికి సోకుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ చైనాను అతలాకుతలం చేస్తోంది. షాంఘై నగరం పూర్తి లాక్ డౌన్ లో ఉంది.

కాబట్టి ఇంతకు ముందులా కాకుండా ఇప్పటి నుండే సరైన కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. ఇక కరోనా సోకకముందే భయపడిపోకుండా దైర్యంగా ఎదుర్కోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిన్న దేశంలో 861 కొత్త కేసులు నమోదు కాగా, ఆరు మంది మరణించారు. రికవరీ రేట్ భారీగా పెరిగింది, ప్రస్తుతం రికవరీ రేట్ 98.76 శాతంగా ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: