ఇక సహజ సిద్దంగా కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మన ఇంట్లో ఉండే దోమలను చాలా ఈజీగా నివారించుకోవచ్చు. దోమలను నివారించే చిట్కాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మన ఇంట్లో తలుపులను ఇంకా అలాగే కిటికీలను మూసి వేసి కర్పూరాన్ని వెలిగించి దాని నుండి వచ్చే పొగను ఇళ్లంతా కూడా వచ్చేలా చూసుకోవాలి. లేదా కర్పూరాన్ని పొడిగా చేసి దానికి వేప నూనెను కలిపి దీపంని వెలిగించాలి. లేదా ఈ మిశ్రమాన్ని దోమలను నివారించే రిఫిల్స్ లో పోసి ఆన్ చేయాలి. ఇలా చేసినా కూడా ఇంట్లో ఉండే దోమలు చాలా ఈజీగా బయటకు వెళ్లిపోతాయి.ఇంకా అలాగే వెల్లులి రెబ్బలను తీసుకొని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని ఇంట్లో స్ప్రే చేయడం వల్ల కూడా దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయను తీసుకొని మూడు లేదా నాలుగు ముక్కలుగా చేసి కిటికీల దగ్గర ఉంచినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా అలాగే నిమ్మకాయలను అడ్డంగా ముక్కలను కోసి ఆ ముక్కలో కొన్ని లవంగాలను గుచ్చి ఇంట్లో అక్కడక్కడ ఉంచినా కూడా దోమలు ఈజీగా పోతాయి. కొబ్బరి నూనె ఇంకా వేప నూనెను సమానంగా తీసుకుని శరీరానికి రాసుకోవడం వల్ల దోమలు మనల్ని కుట్టకుండా ఉంటాయి.ఇంకా అలాగే పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి ఆ నీటిని బాటిల్‌లో పోసి ఇంట్లో స్ర్పే చేసుకోవడం వల్ల కూడా దోమలు ఈజీగా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉండడంతోపాటు ఇంట్లోని దోమలు కూడా ఈజీగా బయటకు పోతాయి. ఇంకా వీటితోపాటు ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా ఇంకా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా అలాగే హానికర రసాయనాలను వాడడానికి బదులుగా ఈ చిట్కాలను పాటించడం వల్ల దోమలు రాకుండా ఉండడమే కాకుండా మనకు కూడా ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: