సాధారణంగా చాలామంది బచ్చలి కూరను తినడానికి ఆసక్తి చూపించరు.. కానీ ఇందులో ఉండే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా తినడానికి ఆసక్తి చూపుతారు అనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా బచ్చలి కూర గ్రామాల్లో, పట్టణాలలో, ఇంటి పెరట్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉండే ప్రదేశాలలో పండిస్తారు.. బచ్చలి కూర పంటకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేస్తే చాలు తీగలా అల్లుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఔషధానికి ఉపయోగించే మొక్కల్లో బచ్చలి కూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బచ్చలి కూరను పప్పులాగా చేసుకుని తింటే జ్వరం, జలుబు ఇట్టే తగ్గిపోతాయి. అంతేకాదు కడుపులో మంట కూడా దూరం అవుతుంది.


సాధారణంగా పచ్చ కామెర్లు వచ్చిన వారికి ఉపయోగించే చికిత్సలో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక బచ్చలి కూరను ఆహారంగా మనం తీసుకున్నప్పుడు ఒంటిలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇక కంటి చూపు మందగించిన వారికి బచ్చలి కూర బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక ఊబకాయంతో బాధపడే వారికి అద్భుతమైన మెడిసిన్ ఈ కూర. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపిస్తుంది దీంతో విషతుల్యమైన పదార్థాలు ఏమైనా బాడీలో ఉంటే అవి వెంటనే బయటకు వచ్చేస్తాయి.

బచ్చలాకులో ఉండే రసాన్ని జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకున్న  మలినాలు అన్ని ఇట్లే బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాదు పొట్ట శుభ్రం అవుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గి , ప్రశాంతత లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగుపడుతుంది. ఇక బిపి ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా తరచూ బచ్చలి కూర తినే వారిని మలబద్ధక సమస్యలు కనిపించవు . కడుపుబ్బరం కూడా దూరం అవుతుంది.  అజీర్తి,  కడుపులో మంట వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: