కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తీసుకోండి..కాలేయ పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోగల ఆరోగ్యకరమైన పానీయాలలో ఖచ్చితంగా కాఫీ ఒకటి. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్నవారిలో, కాఫీ తీసుకోవడం వల్ల సిర్రోసిస్ లేదా కాలేయం దెబ్బతినే అవకాశం తగ్గుతుంది. కాఫీ వినియోగం వల్ల కాలేయ అనారోగ్యం, వాపును నియంత్రించి లివర్ ను కాపాడుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న వ్యక్తులు రోజూ మూడు కప్పుల వరకు తీసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బ్లూబెర్రీస్, క్రాన్‌బెర్రీస్ రెండింటిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు కాలేయం దెబ్బతినకుండా కాపాడుతాయి. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌ల కార్యకలాపాలను, రోగనిరోధక కణాల ప్రతిస్పందనను కూడా మెరుగుపరుస్తాయి.వోట్మీల్ మీ ఆహారంలో ఫైబర్ పెంచడానికి ఒక సాధారణ మార్గం. ఓట్స్‌లో ఉండే ప్రత్యేక ఫైబర్‌లు కాలేయానికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి. 


ఫైబర్ జీర్ణక్రియలో కీలకమైన భాగం. వోట్స్ రోగనిరోధక వ్యవస్థ మాడ్యులేషన్‌లో సహాయపడతాయి. ఇంకా వాపును తగ్గిస్తాయి. మధుమేహం, ఊబకాయంతో పోరాడడంలో ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి.కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే ఆకు కూరలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకు కూరలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆహారంలో కూరగాయలను పెంచుకోవాలి. ఆకు కూరలు, బ్రోకలీ లాంటి వాటిని తినాలి. దీని ద్వారా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి రక్షణ పొందవచ్చు.అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ద్రాక్షలో దాగున్నాయి. ఇవి ఎరుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి. మంటను తగ్గించడంతోపాటు.. లివర్‌ను ఆరోగ్యంగా కాపాడతాయి. ఇంకా శరీరంలోని యాంటీఆక్సిడెంట్ స్థాయిలను కూడా పెంచుతాయి.కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తీసుకోండి..ఎప్పుడూ కూడా కాలేయాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: