చాలా మంది కూడా వేగంగా బరువు తగ్గాలని వివిధ రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. అయితే ఏది పడితే అది పాటిస్తే బరువు తగ్గకపోగ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన పద్దతిలో బరువు తగ్గాలనుకునే వారు కింద తెలిపే చిట్కాలను పాటించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు వారానికి కిలో చొప్పున ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల కొవ్వు కరగడంతో పాటు కండరాలు కూడా బలంగా తయారవుతాయి. ఈ టిప్స్ పాటించడం అలాగే వ్యాయామాలు చేయడం మరిచిపోవద్దు. అలాగే ఈ టిప్స్ పాటించడం వల్ల ఒత్తిడి ఇంకా అలాగే నీరసం కూడా చాలా ఈజీగా దూరమవుతాయి.భోజనంలో మిరియాలను కలుపుకుని తినాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గడంలో నీరు అద్భుతంగా పని చేస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కొవ్వు కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. అలాగే శరీరానికి తగినంత నిద్రపోవాలి.  బరువు పెరగడానికి నిద్రలేమి కూడా కారణం అవుతుందని తెలియజేస్తున్నాయి.


రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం, అలాగే రాత్రిల్లు స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అంది సులువుగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కొన్ని స్ట్రెస్ హార్మోన్లు విడుదలయ్యి అధిక ఒత్తిడికి కారణమవుతున్నాయి.భోజనంలో ప్రోటీన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన డైట్ లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కనుక భోజనంలో ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటే తప్పకుండా బరువు తగ్గవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్, చక్కెరలు ఉన్న పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాలు చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయి. కార్బోహైడ్రేట్స్, చక్కెరల వల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. అదేవిధంగా  రంగులు ఉన్న పదార్థాలను, ప్రిజర్వేటివ్స్ కలిపిన పదార్థాలు తీసుకోవడం మానివేయాలి. ఇవి అన్నీ కూడా సోడియంతో కూడుకుని ఉంటాయి. కాబట్టి వీటిని పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే వేపుళ్లను, జంక్ ఫుడ్ ను కూడా దూరం పెట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: