కర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్దకంతో బాధపడుతున్న వారు రోజూ సాయంత్రం పూట 4 నుండి 5 కర్జూరాలను నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి.ఉదయాన్నే ఆ నీటిని తాగి కర్జూరాలను తినడం వల్ల మలబద్దకం సమస్య తీరుతుంది. విరోచనం సాఫీగా అవ్వడంలో కర్జూరం చక్కగా పని చేస్తుంది. కర్జూరంలో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ధృడంగా ఉంచుతాయి. అంతేకాకుండా దంతాలను కూడా ధృడంగా ఉంచుతాయి. జలుబు, కఫం, రక్తహీనత వంటి వాటిని కూడా కర్జూరాలు తగ్గిస్తాయి. కర్జూరాల్లో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. క్యాన్సర్ ను అరికట్టే గుణం కూడా కర్జూరాలలో అధికంగా ఉంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని కర్జూరాలను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గుండె బలహీనంగా ఉన్న వారు కర్జూరం తీసనుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్ లు అధిక శాతంలో ఉంటాయి. ఇవి శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి.


ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి కంటి సమస్యలు నివారిస్తుంది. సన్నగా ఉన్నవారు కర్జూరాలను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కర్జూరాల్లో తక్కువ కొలెస్ట్రాల్, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు కర్జూరాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడే వారు రోజూ కర్జూరాలను తీసుకోవడం వల్ల త్వరగా రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా మూత్రపిండాల ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడడంలో కర్జూరం సమర్థవంతంగా పని చేస్తుంది.తిన్న వెంటనే తక్షణ శక్తిని ఇచ్చే పండుగా కర్జూరాన్ని చెప్పవచ్చు. కర్జూరంలో విటమిన్ ఎ, విటమిన్ బి తో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్ తో కూడిన పవర్ హౌస్ గా కర్జూరాన్ని పిలుస్తారు. కర్జూరాన్ని పాలతో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ కర్జూరాలను తీసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఖర్జూరాలను తీసుకునే వారిలో గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: