ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ తప్పక ఉంటోంది. ఒక మనిషికి ఎవరు ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అని భ్రమపడుతున్న రోజులివి. మనము ఫోన్ కు ఎంతలా బానిస అయిపోయాము అంటే.. ఫోన్ లేకుండా కొన్ని పనులను కూడా మనము చేసుకోలేనంత.. పొద్దున్న లేచి దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చాలా పనుల్లో ఫోన్ సహాయం తీసుకుంటున్నాము. ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా ఆర్డర్ చేస్తున్నాము, ఫుడ్ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే పనులు ఫోన్ ల ద్వారా చక్కబడుతున్నాయి. కానీ ఫోన్ ల వలన లాభం ఉన్న నష్టాలు కూడా ఉన్నాయన్నది అందరూ గమనించాలి.

ఒక ఫారిన్ యూనివర్సిటీ చేసిన సర్వే ప్రకారం మనము వాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్ లో 17 వేల బ్యాక్టీరియాలు ఉన్నట్లు చెప్పారు. అంతే కాకుండా మన ఇంట్లో ఉండే టాయిలెట్ సీట్ మీద ఉండే బ్యాక్టీరియా కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందట. అది కూడా టీనేజర్ లు వాడే ఫోన్ ల మీద ఎక్కువ బాక్టీరియా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం చాలా మంది యువకులు పొద్దున్న నిద్ర లేవగానే బాత్రూం లోకి ఫోన్ లను తీసుకెళుతున్నారట. వెళ్లి వచ్చేస్తే పర్వాలేదు.. కానీ గంటలు గంటలు అక్కడే ఉండడం వలన బాత్రూం లో ఉండే బాక్టీరియా అంతా ఫోన్ మీదకు చేరుతోందట. వీరిలో అమెరికాకు చెందిన 75 శాతం మంది బాత్రూం కు ఫోన్ తీసుకెళ్తున్నారు.

డాక్టర్లు చెబుతున్న ప్రకారం ఇలా బాత్రూం లోకి ఫోన్ తీసుకు వెళ్లడం వలన చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

* బాత్రూం లో ఎక్కువసేపు ఫోన్ పట్టుకుని కూర్చోవడం వలన పెద్ద ప్రేగులో ఒత్తిడి పెరుగుతుందట. దీని ద్వారా మలద్వారం సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

*  జీర్ణాశయ సమస్యలు కూడా ఉత్పన్న అవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

*  బాత్రూం లో ఫోన్ ను వాడడం వలన సమయం వృధా అవుతుంది. తద్వారా అనుకున్న పనులు సమయానికి కాకుండా మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది.

* ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్స్ తెలుపుతున్నారు.

ఇన్ని నష్టాలు మరియు మీకు ప్రమాదం వాటిల్లుతున్న కారణంగా బాత్రూం లోకి ఫోన్ ను తీసుకువెళ్లకపోవడమే చాలా ఉత్తమం.  

మరింత సమాచారం తెలుసుకోండి: