ఇప్పుడున్న జీవన విధానంలో మన శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరము. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిస్తాపప్పులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకోవలసిన ఆహారం. పిస్తాపప్పులో ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల గుండెసంబంధిత రోగాలు రాకుండా కాపాడుతాయి. ఇందులో లుటిన్, కెరోటినాయిడ్లు కావాల్సినంత ఉండటం వల్ల, ఇవి కళ్ళ ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. దీనినీ "లో క్యాలరీ ఫుడ్ "అని కూడా చెప్పవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరబరువు అదుపులో ఉంటుంది. ఎంతటి ఉబకాయాన్ని అయినా ఇట్టే తగ్గిస్తుంది.

 డయాబెటిస్..
 ఈ రోజుల్లో  మధుమేహంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న సరే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ నీ అదుపులో ఉంచుతుంది. వారి శరీరంలోనీ ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. పిస్తాపప్పులో  యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండడం వల్ల ముఖం అందం, జుట్టు సమస్యలను నివారిస్తుంది.

పిస్తాపప్పుని ఎక్కువగా పిల్లలకి ఇవ్వడం వలన మెదడు నాడీవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్  వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. పెద్దలలో వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్ నీ సైతం తగ్గిస్తుంది.

పిస్తాపప్పులు రోజు మోతాదులో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల సీజనల్గా వచ్చే రోగాలను రాకుండా నివారిస్తుంది.ఇందులో  ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి  చాలా బాగా సహాయపడుతుందనీ ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అంతే కాకుండా బాలింతలకు కూడా బలాన్ని చేకూర్చే ఆహారంలో ఇది ఒక్కటని చెప్పవచ్చు. వీటిని వారు ఎక్కువగా తీసుకోవడం వల్ల పాలు ఊత్పత్తి  మెరుగ్గా ఉండి, శిశువు ఆరోగ్యాంగా ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: