సాధారణంగా కుంకుమ పువ్వును గర్భిణీస్త్రీలు రోజు పాలల్లో కలుపుకొని తాగితే బిడ్డ మంచి రంగుతో,అందంగా పుడతారని పెద్దలు చెబుతూ ఉంటారు.కానీ దీనిని తరుచుగా వాడటం వల్ల గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాక ఇతరులకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది..
కుంకుమపువ్వు రెండు రెమ్మలు తీసుకొని గోరు వెచ్చని పాలల్లో కలుపుకొని తరుచూ తాగుతూ ఉంటే ఇది నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.మెదడు పెరుగుదలకు దోహదపడి అల్జీమర్స్ వంటి వ్యాధులను రాకుండా నివారిస్తుంది.

మానసిక ఆందోళన ను దూరం చేస్తుంది..
మంచి కుంకుమపువ్వుతో తయారు చేసిన కషాయం తాగడం వల్ల అందులో వున్న సుగుణాలు మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేసి, ఆందోళనను తగ్గిస్తుంది. మానసికంగా డిప్రెషన్ గురైన వారికి ఈ కషాయం మంచి ఔషధంగా పనిచేస్తుంది.

స్త్రీల ఋతుక్రమణ సమస్యలు తగ్గించడానికి..
సాధారణంగా ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లేదా PMS సమయంలో వచ్చే కడుపు నొప్పి,అధిక రక్తస్రావము వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని నివారించడానికి కుంకుమపువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి..
శరీరంలోని అధికంగా వున్న చెడు కొలెస్ట్రాలను కరిగించడంలో  కుంకుమపువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇది శరీర మెటబాలిజంను  పెంచుతుంది.దీనిని తగిన మోతాదులో రోజూ వారి ఆహారాలలో చేర్చుకుంటే మెరుగైన ఫలితం లభిస్తుంది.

 చర్మ ఆరోగ్యానికి..
 కుంకుమపువ్వు ఆరోగ్యానికి కాక అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల  ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.దీనిని తరుచూ వాడే లేపనాలలో కలిపి వాడితే సహజసిద్ధంగా మంచి రంగునిస్తూంది.

లైంగిక సామర్థ్యం పెంచడానికి..
పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తిని పెంచి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు వేసుకొని తాగడం వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయని వైద్యనిపుణులు సూచిస్తుంటారు.ఈ పాలను స్త్రీలు కూడా తాగడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: