చాలా మంది కూడా గురక సమస్యతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే  శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా గురక సమస్య వస్తుంది. రక్తపోటు ఇంకా గుండె వ్యాధి వంటి సమస్యలు ఉన్నా కూడా గురక ఈజీగా వస్తుంది. కొన్ని టిప్స్ తో న్యాచురల్ గా మనం ఈ గురక సమస్య నుండి బయటపడవచ్చు. దీన్ని అరికట్టాలంటే నిద్రపోవడానికి మూడు గంటల ముందు మద్యం అస్సలు తాగకూడదు.ఇంకా వెల్లకిలా పడుకోవడం వల్ల గురక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గురక ఎక్కువగా వస్తున్నప్పుడు మీరు పక్కకు తిరిగి పడుకోవాలి. అలాగే మన ముక్కును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంకా  పడుకునే మంచం కింద తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పడుకునే ముందు నీటిలో యూకలిప్టస్ నూనె వేసి బాగా ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా గురక సమస్య అసలు రాకుండా ఉంటుంది. ఇంకా అలాగే గురక సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రాణాయామం వంటివి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి.


ఇంకా అలాగే వీలైనంత త్వరగా బరువు కూడా తగ్గాలి. ఈ టిప్స్ పాటిస్తూనే నిద్రించే ముందు ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేసి రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.ఇంకా అలాగే ఈ నెయ్యిని అరి చేతులు ఇంకా అరి కాళ్లల్లో రాసుకుని మసాజ్ చేయాలి. అలాగే గురకను తగ్గించడంలో వాము మనకు బాగా ఉపయోగపడుతుంది. నిద్రించే ముందు వాముతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల కూడా గురక సమస్య నుండి బయటపడవచ్చు. ఇంకా అలాగే కొన్నిసార్లు గాలిలో ఉండే దుమ్ము ఇంకా ధూళి కూడా గురకకు కారణమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం నిద్రించే గది  శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. గదిలో మంచి ఎయిర్ ఫ్యూరీ ఫైయర్ లను ఉంచుకోవాలి. అలాగే పడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో యాలకుల పొడి వేసి ఆ నీటిని తాగాలి. ఈ యాలకుల పొడి గొంతు తడి ఆరిపోకుండా చేస్తుంది. ఈ టిప్స్ పాటించిన కూడా గురక తగ్గకపోతే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: