మన శరీరంలో కనుక కొలెస్ట్రాల్ పెరిగితే ఖచ్చితంగా రక్తనాళికల్లో పేరుకుపోతుంటుంది. అందువల్ల రక్త సరఫరాలో చాలా ఇబ్బంది ఏర్పడి..రక్తపోటు పెరగడం, గుండెపోటు రావడం జరుగుతుంది. అయితే మనం తీసుకునే డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కొలెస్ట్రాల్ ని చాలా ఈజీగా తగ్గించవచ్చు. కొన్ని రకాల పండ్లను డైట్‌లో భాగంగా చేసుకొని తింటే కొలెస్ట్రాల్ ని చాలా సులభంగా తగ్గించవచ్చు.ద్రాక్ష పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ద్రాక్షను మన డైట్‌లో భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా సులభతరమౌతుంది. ద్రాక్షలో ఫైబర్ ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.అలాగే పియర్‌లో కూడా కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు చాలా ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఫుష్కలంగా ఉంటాయి. అందువల్ల ప్రతి రోజూ కూడా ఇవి తీసుకుంటే కొలెస్ట్రాల్ చాలా ఈజీగా తగ్గుతుంది. ఇందులో పేక్టిన్ అనే ఫైబర్ ఇందుకు సహాయపడుతుంది.


అలాగే ఆరెంజ్ ఇంకా లెమన్‌లతో కూడా కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. ఇందులో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. అందువల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. ఇంకా అలాగే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా ఈజీగా తగ్గుతుంది.అలాగే బొప్పాయి కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా చాలా వేగంగా కరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.ఇంకా అలాగే యాపిల్‌లో పోలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి. యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుంది. శరీరంలో మెటబోలిజం పెరిగి కొలెస్ట్రాల్ తగ్గడంలో కూడా ఈ పండు సహాయపడుతుంది. యాపిల్  కొవ్వును చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా అలాగే గుండె సంబంధిత వ్యాధుల ముప్పుని దూరం చేసేందుకు కూడా యాపిల్ ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: