సాధారణంగా మన పెరట్లోనూ, రోడ్లపక్కన, పొలాల చుట్టూ కంచె కోసము కానుగచెట్లు మనము ఎక్కువగా పెంచుతుంటాము.దీని నీడ చాలా చల్లదనాన్ని ఇస్తుందని మనకందరికి తెలిసిన విషయమే.కానీ దీని ద్వారా కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి అందరికి అవగాహన ఉండదు. కానుగచెట్టు ఆకుల నుంచి వేర్ల వరకు అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఏంతో బాగా సహాయపడతాయి. అలాంటి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. కానుగఆకుల కషాయాన్ని తరుచు తీసుకోవడం వల్ల గ్యాస్‌, అసిడిటీ, కడుపునొప్పి, మలబద్దకం, అజీర్ణం, విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత రోగాలను దరిచేరనీదు. అంతేకాక ఇందులో వున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గు, జలుబు, వాంతులు వంటి సీజనల్ వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి.

2. కానుగగింజలను తీసుకొని, అందులో తేనె లేదా నెయ్యి వేసి బాగా నూరి, అ మిశ్రమాన్ని త్రాగటం వల్ల గాయాల నుండి కారే రక్తస్రావం తగ్గుతుంది.అంతే
కాక గాయాలు తొందరగా మానుతాయి.

3.గడ్డలతో బాధపడేవారు..కానుగవేర్లను తీసుకొని,బాగా ఎండబెట్టి, పొడిలా చేసుకోవాలి. ఒక టేబుల్ స్ఫూన్ ల కానుగ పొడిని తీసుకొని తగినంత నీళ్ళు వేసి పేస్టుల చేసుకోవాలి. దాన్ని గడ్డలపై పెట్టి కట్టులా కడితే,గడ్డలు తొందరగా మెత్తబడి,పగిలిపోతాయి.

4.పైల్స్ తో బాధపడేవారికి కానుగ చెట్టు బెరడు చాలా బాగా సహాయపడుతుంది.దాని కోసం కానుగ చెట్టు బెరడును తీసుకొని,నీటితో కలిపి మెత్తగా నూరి,ఆ మిశ్రమాన్ని మొలలపై రాయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొలలకు తొందరగా ఉపశమనం కలుగుతుంది.

5.కానుగగింజల నుంచి తీసే నూనెతో దీపాలు పెట్టడం వల్ల, అది ఒక రకమైన వాసనను వెదజల్లుతుంది. ఆ వాసనకు గాలిలో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. దాంతో గాలి శుభ్రమవుతుంది.

6. సాధారణంగా దంతాలను వేపపుల్లలతో  శుభ్రం చేసుకుంటూ ఉంటాము.కానీ కానుగపుల్ల కూడా దంతాలను బాగా శుభ్రం చేస్తుంది.ఈ పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల నుండి రక్తకారడం, దుర్వాసన,పిప్పి పన్ను వంటి సమస్యలు తగ్గి, పళ్ళు దృఢంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: