కడుపుతో వున్నప్పుడు స్త్రీలకు కావాల్సిన పోషకాలన్ని పచ్చికొబ్బరిలో పుష్కళంగా లభిస్తాయి. దీనిని తరుచు తీసుకోవడం వల్ల తల్లికీ,బిడ్డకీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.కొబ్బరినూనెలో వున్న ఫ్యాటీ యాసిడ్స్ , శిశువు ఎదుగుదలకు సహాయపడతాయి. ఇందులోని ల్యూరిక్ యాసిడ్,తల్లిలో పాల ఉత్పత్తి అవడానికి దోహదం చేస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే 'విటమిన్ ఈ ' అధికంగా ఉంటుంది. ఇది తల్లీ, బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కావున ప్రతి గర్భిణీ మహిళ ఇన్ని పోషకాలున్న కొబ్బరిని తమ డైట్ లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల కలిగే ఇతర లాభాలెంటో చూద్దాం..

వాంతులు వికారం తగ్గించుకోవడానికి..
కడుపుతో వున్నప్పుడు ఎక్కువగా ఇబ్బందిపెట్టే వాంతులు,వికారం ఫీలింగ్ ను కొబ్బరిలో ఉండే ల్యూరిక్ యాసిడ్ తగ్గిస్తుంది.అలాగే గ్యాస్ , గుండె మంటను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

 పొట్టపై దురదతగ్గించుకోవడానికి..
కడుపుతో వున్నప్పుడు, పొట్టపై దురదగా అనిపిస్తూ ఉంటుంది.దానిని తగ్గించుకోవడానికి కొబ్బరి నూనే చాలా బాగా సహాయపడుతుంది.మరియు స్ట్రెచ్ మర్క్స్ ని తగ్గిస్తుంది.

రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి..
ఈ సమయంలో వివిధ ఆహారాల వల్ల, ట్యాబ్లేట్స్ వాడటం వల్ల 50 శాతం రక్తం తగ్గి,కాళ్లలో వాపులు వస్తాయి. అలాంటి వారు పచ్చికొబ్బరి తినడం వల్ల రక్తం వృద్ధి చెంది, వాపులను తగ్గిస్తుంది.


యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి..
గర్భ ధారణ సమయంలో కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువగా వెళ్తారు. దానితో బ్యాక్టీరియా బయటకి పోయి,యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయం చేస్తాయి.

రక్త హీనతను తగ్గించుకోవడానికి..
ఈ సమయంలో ఎక్కువగా బాధపడే సమస్య రక్తహీనత. అలాంటి వారు పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల, ఇందులోని ఐరన్ రక్త వృద్ధికి దోహదపడుతుంది.

జీర్ణ శక్తి మెరుగుపర్చుకోవడానికి..
కొబ్బరినీళ్లతో పాటు, పచ్చి కొబ్బరి తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల, ఈ సమయంలో బాధించే మలబద్ధకంను అరికట్టవచ్చు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన కొబ్బరి పదార్థాలను గర్భిణీ స్త్రీలు రోజువారీ ఆహారంలో తీసుకోవడం ఉత్తమం..

మరింత సమాచారం తెలుసుకోండి: