సాధారణంగా చాలామంది పనిలో బిజీగా ఉండడం వల్ల ఉదయం అల్పాహారం చేయడాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు పూజలు చేస్తూ రాత్రి సమయంలో అలాగే ఉదయాన్నే ఉపవాసం పేరిట అటు భోజనం ఇటు అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది బరువు తగ్గాలనుకునే వారు కూడా ఉదయం లేకుంటే రాత్రి సమయంలో ఏదో ఒక పూట తినడం మానేస్తారు.. ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో వర్క్ ప్రెషర్ నైట్ లైఫ్ కారణంగా మనలో చాలామంది ఉదయమే టిఫిన్ చేయడానికి స్కిప్ చేస్తున్నారు. ఆడవారైతే పూజలు చేస్తూ రాత్రి సమయంలో ఉపవాసం కూడా ఉంటున్నారు.

మరికొంతమంది బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలా స్కిప్ చేస్తూ ఉండడం గమనార్హం.  నిజానికి ఇలా తినడం మానేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట.  సాధారణంగా ఉపవాసం వల్ల మొత్తం చెడు జరగకపోయినా కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతాయి . ఉపవాసం రోగనిరోధక వ్యవస్థ పై ప్రతికూలంగా ప్రభావితం చూపుతుందని గుర్తించాలి. ఉదయం అల్పాహారం,  రాత్రి భోజనం స్కిప్ చేయడం వల్ల గుండె ప్రమాదాలు పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.  కాబట్టి అల్పాహారం దాటవేసినప్పుడు కూడా ఈ ప్రభావాలను మీరు గమనించాలి.

తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం మెదడులో రోగ నిరోధక కణాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధనల ఆధారంగా దీర్ఘకాలిక ఉపవాసం శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి తగ్గిపోయి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయట అలాగే ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బులు,  క్యాన్సర్ తో పోరాడే శక్తి మన శరీరానికి లేక ఇలా ఎన్నో అనర్ధాలు జరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉపవాసాల పేరిట లేదా పని , కారణాల పేరిట ఉదయం అల్పాహారం,  రాత్రి భోజనం మాత్రం స్కిప్ చేయకండి.  కనీసం తక్కువ మోతాదులో తీసుకున్నా  సరే పర్వాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: