నొప్పులతో చాలా ఎక్కువగా బాధపడే వారు పెయిన్ కిల్లర్ లను వాడే పని లేకుండా సహజ సిద్దంగా లభించే ఎప్సమ్ సాల్ట్ ను వాడటం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక దీనినే మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు.ఈ ఉప్పును పొడిగా చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ ఎప్సమ్ సాల్ట్ తో మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయి. కండరాలకు ఉపశమనాన్ని కలిగించి నొప్పిని తగ్గించడంలో ఈ సాల్ట్ చాలా బాగా సహాయపడతాయి. ఈ మెగ్నీషియం సల్ఫేట్ కండరాల్లో ఉండే కణజాలాల్లోకి వెళ్లి నొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. మన శరీరమంతా నొప్పులుగా ఉన్నప్పుడు ముందుగా శరీరానికి ఆవ నూనెను రాసుకోని ఆ తరువాత ఎప్సమ్ సాల్ట్ ను పొడిగా చేసి శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇక ఇలా చేయడం వల్ల కండరాలు విశ్రాంతికి గురి అయ్యి నొప్పులు చాలా త్వరగా తగ్గుతాయి. ఇలా మసాజ్ చేసుకున్న తరువాత వేడి నీళ్లతో స్నానం చేయాలి లేదా స్టీమ్ బాత్ చేయాలి.


ఇలా చేయడం వల్ల నొప్పుల నుండి ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా అలాగే నొప్పులతో బాధపడే వారు బాత్ టబ్ లలోవేడి నీటిని నింపాలి.ఆ తరువాత ఇందులో 150 నుండి 200 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ ను వేసి కలిపి ఈ నీటిలో 15 నుండి 20 నిమిషాల పాటు ఉండడం వల్ల కూడా నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే పాదాల నొప్పులు ఇంకా చేతులు నొప్పులతో బాధపడే వారు గిన్నెలో లేదా బకెట్ లో వేడి నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో పాదాలను ఇంకా చేతులను ఉంచాలి. ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉంచడం వల్ల పాదాల నొప్పులు, పిక్కల నొప్పులు, చేతుల నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే నొప్పులతో బాధపడే వారు వేడి నీటిలో ఎప్సమ్ సాల్ట్ ను వేయాలి. తరువాత ఈ నీటితో కాపడం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా నొప్పులు సులభంగా తగ్గుతాయి. ఈ విధంగా ఎప్సమ్ సాల్ట్ న్యాచురల్ పెయిన్ కిల్లర్ లా పని చేస్తుందని దీనిని ఉపయోగించడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటు ఎలాంటి దుష్ప్రభావాలు కూడా రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: