ప్రకృతి అందించే ఎన్నో రకాల పండ్లు కూరగాయలలో మునగాకు కూడా ఒకటి . అయితే తరచూ చూస్తూనే ఉంటాము మరీ ముఖ్యంగా మునగ కాయలను మొదలుకొని మునగా ఆకు వరకు ప్రతి దాంట్లో కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అయితే వాటి గురించి తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. కొంతమంది మునగకాయలు తినడానికి అస్సలు ఇష్టపడరు. మరి కొంతమంది మునగాకు తినడానికి చేదుగా ఉంటుందని దూరం పెడుతూ ఉంటారు.. కానీ మునగ ఆకులు వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా డయాబెటిస్ వారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తరచూ తాగుతూ ఉంటే తాత్కాలిక నపుంసకత్వం తగ్గిపోయి సంతానం లేని సమస్య నుంచి బయటపడతారు. అలాగే ఒక టేబుల్ స్పూన్ మునగ పూల రసాన్ని తీసుకొని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగుతూ ఉంటే  ఉబ్బసానికి,  అజీర్తికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.  మరీ ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు మందులతో పాటు లేత కొబ్బరి నీటిలో ఒక చెంచా మునగ పువ్వుల రసాన్ని కలిపి తాగితే కచ్చితంగా నయమవుతుంది.

ఇకపోతే మునగాకు ఒక కప్పు రసం బాగా వేడి చేసి చల్లార్చి ఆ తర్వాత నీటిని వంచేసి మిగిలిన పదార్థంలో పాలు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీ స్త్రీలకు తరచూ ఇస్తూ ఉంటే వారి పిండం చక్కగా పెరుగుతుంది. అలాగే ప్రసవం కూడా సౌకర్యంగా అవుతుంది. ఇకపోతే మునగ ఆకులో ఉండే కాల్షియం, విటమిన్స్,  ఐరన్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. ఇకపోతే మునగాకు రసం బాగా మరిగించి చల్లార్చిన తర్వాత ఒక చెంచా మోతాదులో తీసుకొని ఒక క్లాస్ క్యారెట్ జ్యూస్ లో కలిపి తాగుతూ ఉంటే మూత్ర విసర్జన సమస్యలు తొలగిపోయి.. మూత్రపిండాల వ్యాధులు , మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: