ఈ ప్రపంచంలో మనకు మన తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలో కూడా సంపూర్ణం గా దొరకవు. కానీ స్పిరులినా ఆకుల్లో తల్లి పాలకు సమానంగా పోషకాలు చాలా ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఈ మొక్క సముద్ర గర్భంలో పెరుగుతుంది.స్పిరులినా వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.స్పిరులినా మొక్క ఆకుల పొడిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతంటే సాధారణ పాలకన్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది.దీంతో ఎముకలకు చాలా బలం కలుగుతుంది. దేహ నిర్మాణానికి, కణజాలాల మరమ్మత్తులకు ఇంకా కొత్త కణజాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువగా అవసరం అవుతాయని అందరికీ తెలిసిందే.అయితే స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం దాకా ప్రోటీన్లు ఉంటాయి. మనకు లభిస్తున్న అన్ని ఆహార పదార్థాల్లోకెల్లా అత్యంత ఎక్కువగా ప్రోటీన్లు కలిగిన ఆహారం ఇదే. నాన్ వెజ్ తినని వారు దీని పొడిని తీసుకుంటే ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి.


శరీర పెరుగుదలకు అవసరమైన అమైనో యాసిడ్లు, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడంలో అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో క్లోరోఫిల్ బాగా పనిచేస్తుంది.అలాగే పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. నరాల బలహీనత పోతుంది. లివర్‌ను బాగా శుభ్ర పరుస్తుంది.మధుమేహం ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. అలాగే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. గుండె సంబంధ వ్యాధులు అస్సలు రావు. వాపులు ఇంకా నొప్పులు తగ్గిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు అన్ని పోతాయి. జీర్ణక్రియ బాగా మెరుగు పడుతుంది. శరీరంలోని హార్మోన్ల పనితీరు కూడా మెరుగు పడుతుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని మందు లాగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ చాలా ఈజీగా బయటకు వెళ్లిపోతాయి. విటమిన్లు ఎ, కె1, కె2, బి12, ఐరన్‌, మెగ్నిషియం, క్రోమియం, ఫైటో న్యూట్రియెంట్లు, కెరోటినాయిడ్స్‌, జీఎల్ఏ ఇంకా ఎస్‌వోడీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పోషకాలు స్పిరులినాలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: