ఈ నీలి అరటిపండు ఆగ్నేయాసియాలో సాగుచేస్తారు. అంతేకాకుండా హవాయి దీవులలో కూడా ఈ రకం అరటి తోటలు ఉంటాయి. ముఖ్యంగా నీలం రంగు అరటిని దక్షిణ అమెరికాలో కూడా పండిస్తారు. ఎందుకంటే ఈ పంటకు ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. అలాంటి చల్లని ప్రాంతాల్లో మాత్రమే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నీలి అరటిని టెక్సాస్, ఫ్లోరిడా,క్యాలిఫోర్నియా, లూసియానాలో ఎక్కువ పండిస్తారు. ఇక దీని రుచి విషయానికొస్తే, ఇది వెనిలా ఐస్క్రీమ్ లాగా ఉంటుందట. ఈ అరటిని బ్లూ జావా అని కూడా అంటారు. ఈ అరటికాయ ఏడు అడుగుల పొడవుంటుంది. ఈ నీలి అరటిపండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్నవారు ఈ అరటిపండు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ అరటిపండు శరీరానికి మరింత చల్లదనాన్ని అందిస్తుంది