ఒక రోజు ఓ నక్క నది తీరాన కూర్చుని బోరు బోరున ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటకి వచ్చి నక్కను ‘‘ ఎందుకు ఏడుస్తున్నావు’’ అని అడిగాయి ‘‘ అయ్యో ! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసాయి.’’ అని ఎడుస్తూనే సమాధానమిచ్చింది నక్క.  పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి. ‘‘ ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుతుంటే నేను వద్దన్నాను. – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి.‘‘? అంది నక్క ‘‘ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు’’ అని అడిగాయి. పీతలు ‘‘ తెలీదు, ఏమైనా పని చూసుకోవాలి.’’ అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క. పీతలన్ని కలిసి అలోచించాయి. ‘‘ మన వల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి’’ అని నిర్థారించాయి. వెళ్లి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్చున ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది. రాత్రయి పున్నమి చంద్రుడ ఆకాశంలోకి వచ్చాడు. నది తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.  ‘‘ ఈ చక్కని వెన్నలతో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది’’ అని నక్క పీతలను అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ల లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క చెప్పటంతో పీతలు కూడా బయలుదేరాయి. కొంత దూరమెళ్లాక నక్క మూలగడం మెదలు పెట్టింది. పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైంది అని చూస్తుండగా హటాత్తుగా అడవిలించి చాలా నక్కలు బయటికి వచ్చి పీతలపై పడ్డాయి, పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధపడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి దారి తీస్తుందని వాటికి అర్థమయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: