రామారావు చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగాడు. పెద్దవాడవుతున్నా ఎవ్వరూ పని చెప్పక పోవడంతో అతను సోమరిపోతుగా మారాడు. తల్లిదండ్రులను చూస్తాడనుకున్న అందరూ అనుకుంటే అతను వారికి ఏ సహాయం చేయకుండా ఖాళీగా కూర్చునేవాడు. ఒకసారి అతను నిధి గురించి విన్నాడు. అప్పటి నుంచి అదే ధ్యాస. నిధి దొరికితే లాభపడతానని భావించేవాడు.తను ఎలాగైనా నిధిని సంపాదిస్తానని అందరితో అనేవాడు. అది విని తల్లిదండ్రులు బాధపడి, పెళ్లి చేస్తే రామారావు మారతాడని అనుకుని పెళ్లి చేశారు. రామారావు భార్య అతన్ని మార్చాలనుకుంది. తనకు పుట్టింటి వారు ఇచ్చిన నగలు కొన్ని ఇంటి వెనుక ఉన్న చెట్టు వద్ద దాచింది. ఆ చెట్టు కింద నిధి ఉందని తనకు కల వచ్చినట్టు రామారావుకు చెప్పింది. రామారావు అక్కడకు వచ్చి చూస్తే, నగలు దొరుకుతాయి. అప్పటి నుంచి రామారావు బద్దకాన్ని వదలిపెట్టి కష్టపడడం ప్రారంభించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: