మన దేశ అణుపితామహుడు హోమీ జహంగీర్ బాబా. అణుశక్తిని కేవలం శాంతికోసమే ఉపయోగించాలని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. 1909 అక్టోబరు 30వ తేదీన ముంబయిలో జన్మించారు బాబా. బొంబాయి లోని కాలేజీలో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువుల కోసం ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చేరారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. చదువు పూర్తయ్యాక అక్కడే ఆచార్యుడిగా చేరారు. కాస్మిక్ కిరణాలపై అనేక పరిశోధనలు చేసి మోజోన్స్ అనే కిరణాలను కనిపెట్టాడు. తర్వాత ఇండియాకు వచ్చి బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరాడు. అప్సర అణురియాక్టర్ తయారీలో, తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 1957లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. 1966వ సంవత్సరంలో జెనీవాలోని అంతర్జాతీయ సదస్సుకు వెళుతూ, ప్రమాదవశాత్తు ఆయన మరణించారు. ఆయనే మన అణుపితామహుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: