దీపావళి సందర్బంగా ఐఆర్‌సీటీసీ 'గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్' అనే ఒక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి నవంబర్ 12న ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఇందులో ఉంటాయి. ఇందులో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.26,000 మాత్రమే. జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ సంస్థ. https://www.irctctourism.com వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.


ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి జైసల్మేర్, ఉదయ్‌పూర్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, 1 రాత్రి జైసల్మేర్, 1 రాత్రి జైసల్మేర్ డిసర్ట్ క్యాంప్, 1 రాత్రి జోధ్‌పూర్, 2 రాత్రులు ఉదయ్‌పూర్‌లో బస, ఐదు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, 1 లంచ్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ ఇలా అన్ని సదుపాయాలు మనకు అందిస్తారు. ఐఆర్‌సీటీసీ 'గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్' టూర్ నవంబర్ 12న హైదరాబాద్‌లో మొదలు అవుతుంది. ఉదయం 05:05 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే అహ్మదాబాద్‌కు 07:05 గంటల కళ్ల చేరుకుంటారు. ఉదయం 10:40 గంటలకు అహ్మదాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:15 జైసల్మేర్ అలా చేరుకుంటారు.


దీని తరువాత మధ్యాహ్నం హోటల్‌కు చేరుకున్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని సైట్‌సీయింగ్‌కు బయలుదేరాలి. జైసల్మేర్ ఫోర్ట్, పట్వోన్ కీ హవేలీ, గడీసర్ లేక్ సందర్శన్ ఈ ట్రిప్లో ఉంటుంది. షాపింగ్ తర్వాత రాత్రి జైసల్మేర్‌లో బస ఉంటుంది. తర్వాత రోజైన నవంబర్ 13 న జైసల్మేర్ ఫోర్ట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత డిసర్ట్ క్యాంప్‌కు వెళ్లి సొంత ఖర్చులతో క్యామెల్, జీప్ రైడ్‌ కు తిరిగి రావచ్చు. సాయంత్రం ఎడారిలో సూర్యాస్తమయాన్ని చూసిన తర్వాత రాత్రికి డిసర్ట్ క్యాంప్‌లో బస ఉంటుంది.


తర్వాతి రోజున నవంబర్ 14 న జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌ కు బయల్దేరాలి. మెహ్రాన్‌ గఢ్ ఫోర్ట్, జస్వంత్ తాడా సందర్శన కొనసాగుతుంది. రాత్రికి జోధ్‌పూర్‌ లో బస చేయాల్సి ఉంటుంది. తర్వాతి రోజైన నవంబర్ 15న జోధ్‌పూర్ నుంచి చిత్తోర్‌ గఢ్ మీదుగా ఉదయ్‌పూర్ వెళ్లాల్సి ఉంటుంది. దారిలో ఉమైద్ భవన్ ప్యాలెస్, చిత్తోర్‌గఢ్ ఫోర్ట్ సందర్శన కూడా ఉంటుంది. మొత్తానికి రాత్రికి ఉదయ్‌పూర్‌లో బస చేయాలి. మరుసటి రోజు నవంబర్ 16న ఉదయ్‌ పూర్ లోకల్ సైట్‌ సీయింగ్ చేయాలిసి ఉంటుంది. రాత్రికి ఉదయ్‌పూర్‌లో బస ఉంటాది. నవంబర్ 17న ఉదయ్‌పూర్‌ లో సైట్ సీయింగ్ ఉంటుంది. ఆ రోజున సాయంత్రం 05:15 గంటలకు ఉదయ్‌పూర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 07:00 గంటల కళ్ల హైదరాబాద్ చేరుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం చకచకా టికెట్స్ బుక్ చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: