తల్లిదండ్రులు ఎలా ఉన్నా సరే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారి ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త తప్పనిసరి.. అయితే ఆరోగ్య నిపుణుల సలహా ఇస్తున్న ప్రకారం తల్లిదండ్రులు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.. తల్లిదండ్రులు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుందట. ఇకపోతే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అన్న మంచిగా ఎదగాలన్నా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.. అవేంటో ఇప్పుడు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

అయితే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే వారు తీసుకునే ఆహారం, యాక్టివిటీ , రోజువారి అలవాట్లతో పాటు ఇతర విషయాలను కూడా తప్పనిసరిగా పట్టించుకోవాలి. ఇక పిల్లల వయసు ఏడాది ఉన్నప్పటినుండి తల్లిదండ్రులు వారి ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకున్నప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే పిల్లల ఆరోగ్యం చాలా బాగా ఉండడమే కాకుండా వారి ఎదుగుదల కూడా అభివృద్ధి చెందుతుంది.

ఎప్పుడైతే మనం పిల్లలను అశ్రద్ధ చేస్తామో అప్పుడు తప్పకుండా పిల్లలు అనారోగ్యం బారిన పడటమే కాకుండా వారి ఎదుగుదల కూడా తగ్గిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.. సాధారణంగా చిన్న పిల్లలకు దగ్గు, జలుబు వంటివి వచ్చినా కూడా పర్వాలేదు లే అంటూ లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ వారి ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో జంక్ ఫుడ్డు లాంటివి అసలుకే పెట్టకూడదు. ఎందుకంటే ఇందులో అసలు పోషకాలు ఉండవు పైగా వీటిలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తో పాటు కొవ్వు పదార్థాలు కూడా ఉండడం వల్ల పిల్లల అనారోగ్యం పై ప్రభావం చూపిస్తాయి.

వీలైనంతవరకు తాజా పండ్లు, పాలు, కూరగాయలు వంటివి పిల్లలకు ఇవ్వాలి. తీపి ఎక్కువగా ఉండే పదార్థాలు , నూడుల్స్ , కూల్ డ్రింక్ వంటివి అసలుకే ఇవ్వరాదు. అంతేకాదు టీవీలకు, ల్యాప్ ట్యాప్ లకు,  సెల్ఫోన్లకు పిల్లలను బానిసను చేయకూడదు. వీలైనంత వరకు పిల్లల్ని పర్యావరణానికి స్నేహితులుగా మార్చడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: