షుగర్ వ్యాధి గ్రస్తులు పొరపాటున కూడా తెల్ల అన్నం తినకూడదు. దీనికి బదులు అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ ను తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇంకా అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే మరో ఆహార పదార్థం బంగాళాదుంప. ఇది ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు షుగర్ వ్యాధి లేని వారికి కూడా త్వరగా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా అలాగే ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా తీసుకునే వారు 18 శాతం త్వరగా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఎండు ద్రాక్షను కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా తినకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఈజీగా పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధి గ్రస్తులు వీటిని వీలైనంత తక్కువగా తినాలి.


అలాగే షుగర్ తో బాధపడే వారు సాఫ్ట్ డ్రింక్ ను ఇంకా ఎనర్జీ డ్రింక్స్ ను కూడా  తీసుకోకూడదు.ఇంకా అలాగే కృత్రిమ చక్కెరలను కూడా మధుమేహ వ్యాధి గ్రస్తులు అస్సలు తీసుకోకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతాయి. కాబట్టి వీటికి కూడా చాలా దూరంగా ఉండాలి. ఇంకా అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు మటన్ ను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. దీనిని తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మటన్ కు బదులుగా చికెన్, చేపలు ఇంకా రొయ్యలు వంటి ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. మధుమేహం వ్యాధి రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలే. కనుక కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు పొరపాటున తినకూడదు. షుగర్ వ్యాధి వచ్చిన తరువాత ఆహార నియమాలను పాటించడం కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: