బరువు తగ్గడం కోసం కొంతమంది ఎక్కువగా ఉపవాసం ఉంటారు. కానీ అలా ఉండటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో మైకము, బలహీనత ఇంకా శరీరంలో పోషకాల కొరత ఉంటుంది. అందువల్ల రాత్రి పూట భోజనం మానేయాలని నిర్ణయించుకున్నవారు దానికి ప్రత్యమ్నాయంగా కొన్ని రకాల ఆహారాలను తింటే మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణుల సూచన. మరి బరువు తగ్గేందుకు భోజనానికి ప్రత్యమ్నాయంగా ఏయే ఆహారాలను తినాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


బరువు తగ్గాలని భావించేవారు వారు లేదా బరువు కోసం రొటీన్‌ పద్ధతులని అనుసరించేవారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఆహారం ఫైబర్ బలహీనత సమస్యను చాలా దూరంగా ఉంచుతుంది.అందువల్ల ఆకలిగా అనిపించకపోవడమే కాక జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.ఇక ఓట్స్‌లో ఫైబర్‌తో పాటు చాలా రకాల ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. సాయంత్రం పూట టిక్కీల రూపంలో ఓట్స్ ని తినవచ్చు.ఈ ఓట్స్‌లో సరైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందువల్ల జీవక్రియ స్థాయి కూడా మెరుగుపడుతుంది. ఈ ఓట్స్ టిక్కీ ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. కావాలంటే ఓట్స్ టిక్కీని మీరు బ్రేక్ ఫాస్ట్‌లో కూడా తినొచ్చు.


అలాగే క్వినోవా ఫైబర్‌కు చాలా మంచి మూలంగా పరిగణించబడుతుంది. సాయంత్రం పూట దీన్ని తీసుకుంటే రాత్రంతా కూడా మీకు ఆకలి వేయదు. ఇంకా ఇందులో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉండటం వల్ల జీవక్రియ రేటు కూడా బాగా మెరుగుపడుతుంది. మీరు మీ బరువు తగ్గించే రొటీన్‌లో క్విన్వా వెజ్ ఉప్మాని తినవచ్చు. ఈ వంటకం నుంచి ఫైబర్ మాత్రమే కాకుండా చాలా విటమిన్లు కూడా లభిస్తాయి.ఇంకా అలాగే బరువు తగ్గాలనుకుంటే  సాయంత్రం పూట పొడి పోహా స్నాక్స్ తినవచ్చు. డ్రై పోహా స్నాక్ చేయడానికి, ఒక పాన్‌లో కొంచెం ఆలివ్ ఆయిల్ ని వేసుకోని అందులో పోహాను చేసుకోండి.అంతేగాక ఇందులో మీరు  వేరుశెనగలను కూడా చేర్చవచ్చు.దీన్ని సాయంత్రం పరిమిత పరిమాణంలో తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: