
పూప్ అనగా..
పావురం విసర్జించే రెట్టలను పరిశీలిస్తే, చిన్న చిన్న గోళీలల్లా కనిపిస్తాయి. మరియు తెలుపు-గోధుమ రంగులో ఉంటాయి.పావురం లాంటి పక్షులు యూరికోటెలిక్ కావడం వల్ల యూరియా, అమ్మోనియాకు బదులుగా యూరిక్ యాసిడ్ రూపంలో మలంను నైట్రోజన్ రూపంలో విసర్జిస్తాయి. ఇందులో అమ్మోనియా అధికంగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి.దీనివలన హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్ మరియు కాన్డిడియాసిస్ వంటి శిలీంధ్ర వ్యాధులకు,పిట్టకోసిస్, ఏవియన్ టీబీ వంటి బాక్టీరియా వ్యాధులకు, బర్డ్ ఫ్లూకి వ్యాపిస్తాయి.డ్రై అయిన రెట్టల నుండి వచ్చే దుమ్మును పీలిస్తే అవి కాలేయం, ప్లీహాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో అధిక జ్వరం, న్యుమోనియా, రక్త అసాధారణతలు, ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యసమస్యలు కలుగుతాయి.
నివారణ చర్యలు..
పావురం రెట్టలను శుభ్రపరిచేటప్పుడు, 0.3 మైక్రాన్ల కంటే కణాలను పిల్టర్ చేసే మాస్క్ లను, షూకవర్లను, గ్లౌస్ లను వాడాలి. మరియు శుభ్రం చేసిన మలంను రెండు రోజులపాటు మూసి ఉంచాలి.మలం శుభ్రం చేసేటప్పుడు ధూళి లేయకుండా, నీళ్లు చల్లి,మలంను శుభ్రం చేయాలి.