మన వంటగదిలో దొరికే ఒక చక్కటి పదార్థాన్ని వాడటం వల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.దీనిని వాడడం వల్ల కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఈ పదార్థం  జాజికాయ. జాజికాయ ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది. దీనిని ఎక్కువగా మసాలా దినుసులుగా వాడతారు. జాజికాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని సరైన పద్దతిలో వాడటం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.జాజికాయను వాడటం వల్ల కీళ్ల నొప్పులను, వెన్ను నొప్పులను, మోకాళ్ల నొప్పులను ఇంకా కండరాల నొప్పులను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జాజికాయ తైలం శరీరంలో వచ్చే అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది.


జాజికాయ తైలాన్ని వాడడం వల్ల మనం నొప్పులను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ తైలం మంచి పెయిన్ కిల్లర్ లాగా పని చేస్తుంది. నొప్పులను దూరం చేసే ఈ జాజికాయ తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను  తెలుసుకుందాం.ఈ తైలాన్ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో 4 టీ స్పూన్ల ఆవ నూనెను తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జాజికాయ పొడిని వేయాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు ఈ నూనెను కలుపుతూ అలాగే వేడి చేయాలి. తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను వాడే ముందు కొద్దిగా దాన్ని వేడి చేసుకోవాలి. ఆ తరువాత ఈ నూనెను శరీరంలో నొప్పులు ఉన్న చోట రాసి కొద్దిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనె చాలా బాగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: