వేసవి మొదలవగానే ఎండలు మండిపోతుంటాయి.ఈ సీజన్లో అధిక వేడి వల్ల,మన శరీరంలోని అధికంగా ఉన్న నీరు మరియు లవణాలు చమటలు రూపంలో బయటకు పంపబడతాయి.శరీరం నుంచి వచ్చే అ మలినాల వల్ల చమట దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది.దానిని కొన్ని రకాల పదార్థాలను వాడటం వల్ల తొందరగా తగ్గించుకోవచ్చు.

వేసవి అనగానే కాటన్ దుస్తులు ధరించడం సర్వసాధారణం.దీనివల్ల చెమట తొందరగా ఎవాపరేట్ అయిపోయి దుర్వాసన రాకుండా కాపాడుతుంది.ఈ సీజన్లో పాలిస్టర్,స్పాండెక్స్ వంటి దుస్తులు వేసుకోవడం వల్ల, ఇవి శరీర దుర్వాసన మరింత పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.యాంటీ ప్రిస్పరెంట్ వాడటం వల్ల చమట దుర్వాసనను సులభంగా తగ్గించుకోవచ్చు.

కెఫెన్ కలిగిన కాఫీ టీలు అధికంగా తీసుకోవడం వల్ల చెమట వాసనను ఎక్కువగా వచ్చేందుకు దోహదపడతాయి.అంతే కాక సల్ఫర్ అధికంగా ఉన్న ఉల్లి,బ్రొకోలీ వంటి కూరగాయలకు కూడా శరీర దుర్వాసన పెంచుతాయి.కావున వేసవిలో వీటిని తీసుకోకపోవడం ఉత్తమం.

వేసవిలో ఎక్కవగా నీళ్ళు, పండ్ల రసాలు,కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మరియు ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవడం వల్ల, ఇవి నేచురల్ డియో డైజర్ గా పనిచేసి,శరీర దుర్వాసనను తగ్గిస్తాయి.మరియు జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది.

కర్పూరం టీ రావటం వల్ల కూడా శరీర దుర్వాసనను తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.దీనికోసం స్టవ్ పై గిన్నె పెట్టి,అందులో ఒక కప్పు నీటిని వేసి,రెండు స్పూన్ల పంచదార,చిటికెడు కర్పూరం వేసి బాగా మరిగించాలి. ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల, శరీర దుర్వాసన నుండి ఉపశమనం పొందవచ్చు.

శరీర దుర్వాస పోగొట్టుకోవడానికి కొన్ని రకాల అయిల్ చాలా బాగా ఉపయోగపడతాయి.అందులో ముఖ్యంగా లావెండర్ ఆయిల్ మూడు స్పూన్ల నీటిలో కలిపి శరీరానికి స్ప్రే చేసుకోవడం వల్ల చెమట దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. మరియు ఆపిల్ సిడర్ వెనిగర్, సేజ్, రోజ్ మేరీ వంటి మూలికలు కలిపి తయారు చేసుకునే డియోడిజర్ కూడా శరీరం నుండి దుర్వాసన రాకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: