వాతావరణంలోని కాలుష్యం,ఎండ,వేడిమి వల్ల ముఖంపై రకరకాల దుమ్ము,ధూళి,మలినాలు పేరుకుపోయి,చాలా రకాల చర్మ సమస్యలను కలిగిస్తాయి.వాటిని వెంటనే తొలగించాలి.లేకుంటే అవి ముఖంపై మొటిమలు,మచ్చలు,చర్మం టాన్ అవ్వడం,మృతకణాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి.చాలామంది వీటన్నిటినీ పోగొట్టుకోవడానికి చాలా ఖర్చు పెట్టి,బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటారు.కానీ ఎటువంటి ప్రయోజనం లేక విసిగిపోతూంటారు.అలాంటి వారికి ఇంట్లో దొరికే పదార్థాలతో తయారుచేసుకునే స్క్రబ్బులు చాలా బాగా ఉపయోగపడతాయి.కావున అటువంటి స్క్రబ్బులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పంచదార స్క్రబ్..
నాచురల్ గానే పంచదారకు స్క్రబ్ చేసె గుణాలు ఉంటాయి.దీనికోసం రెండు స్పూన్ల పంచదారకు,ఒక స్ఫూన్ ఆలివ్‌ అయిల్ ను వేసి బాగా కలపాలి. పంచదార బాగా కలిసిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసి అరగంటసేపు ఆరనివ్వాలి.ఆ తరువాత గోరువెచ్చని నీటితో మర్దన చేస్తూ శుభ్రం చేసుకుంటే సరి. ముఖంపై పేరుకుపోయిన దుమ్ము,ధూళి,జిడ్డు మృతకణాలు నిమిషంలో తొలగిపోయి,ముఖము కాంతివంతంగా తయారవుతుంది.ఇది పెదవులపై కల నలుపు మరియు మృత కణాలు తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.

చాకోలెట్ స్క్రబ్..
దీనికోసం రెండు స్పూన్ల చాక్లెట్ పొడిలో రెండు స్ఫూన్ల బాదాం అయిల్ ను వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి.బాగా అరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి.ఇందులో వాడిన బాదం ఆయిల్ ముఖానికి మాయిశ్చరైసర్ గా పనిచేస్తుంది.మరియు చాక్లెట్ పొడికి స్క్రబ్ చేసే గుణాలు పుష్కలంగా  ఉంటాయి.ఈ మిశ్రమం వల్ల ఎటువంటి చర్మ సమస్యలు ఆయన తగ్గిపోయి చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.

బియ్యం పిండి స్క్రబ్..
మూడు స్ఫూన్ల బియ్యం పిండిలో సరిపడా తేనే, ఒక స్ఫూన్ నిమ్మరసం కలపాలి.ఈ మిశ్రమాన్ని వాడటం వల్ల,ఇది మూసుకుపోయిన చర్మరంధ్రాలను ఓపెన్ అయేలా చేసి,ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.

ఓట్స్ స్క్రబ్..
దీనికోసం ఒక స్ఫూన్ ఓట్స్‌లో,ఒక స్ఫూన్ పాలు,ఒక స్ఫూన్ ఆలివ్‌ అయిల్ ను కలపాలి.ఈ మిశ్రమం మెత్తగా మారిన తర్వాత ముఖానికి,మెడకు అప్లై చేయాలి.ఇది ముఖముపై పేరుకుపోయిన మలినాలను తొలగించి,చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: