గ్రీన్ టీ, క్యాబేజీ,బీట్ రూట్ పాటుగా ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో, తేనె నిమ్మరసం వేసుకొని తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆకుకూరలు కూడా శరీరానికి మంచి మేలును చేస్తాయి. నిమ్మ, ఆరెంజ్ పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి విటమిన్ సీ తో నిండివుంటాయి. శరీరాన్ని దెబ్బతీసే ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడుతాయి. వీటిలోని ఆల్కలైన్ శరీరం యొక్క పీహెచ్ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బలంగా చేస్తుంది. చూసారుగా వీటిని రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..