తోటకూర లో ఎన్నో పోషకాలు దాగివున్నాయి. ఎన్నో రోగాలను నయం చేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా తోట కూరను ఎక్కువగా తీసుకోమని చెప్తుంటారు. అయితే తోట కూరతో కొంత మంది పప్పు లేదా కూరను చేసుకుంటారు. కానీ కొంత మంది ఆకు కూరలతో వెరైటీ గా చేసుకోవాలని భావిస్తారు. అలాంటి వాళ్ళు తోట కూరతో వడలను చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.