కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొద్దిగా పాలు, పెరుగు లేదా మీగడ కలపాలి. అప్పుడు ఉప్పదనం తగ్గడమే కాకుండా కర్రీకి కొత్త రుచి వస్తుంది. ఉల్లిగడ్డ ముక్కలను నూనెలో వేయించి కూరలో కలుపుకున్నా ఉప్పు తగ్గుతుంది. కూరలో కొన్ని టమాటా ముక్కలను కూడా వేయొచ్చు. ఇకపోతే కొబ్బరి పాలను కలపడం..ఇలా చేయడం ద్వారా కూరలో ఉప్పదనం తగ్గి రుచిగా తయారవుతుంది.