ఆడపిల్లల తల్లిదండ్రులు అనగానే ప్రతి ఒక్కరికి భయం మొదలవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలకి ప్రతి విషయంలో కూడా ఖర్చు అనేది ఎక్కువగా వస్తుంది. అందుకోసమే వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేటి నుంచి డబ్బు ఆదా చేయడం మొదలుపెడితే అమ్మాయి యుక్తవయసుకు వచ్చేసరికి డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ప్రస్తుతం భారత దేశంలో లక్షలాది మంది తల్లిదండ్రులు ఆడ పిల్లల భవిష్యత్తు ని తీర్చిదిద్దడానికి సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటితోనే కాకుండా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలలో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరి ఉన్నట్లయితే వారికి శుభవార్త తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీడియా నివేదికల ప్రకారం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ , సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్, సుకన్య సమృద్ధి యోజన పథకం తో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలపై వడ్డీ రేట్లను మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకాల పెట్టుబడిదారులకు ప్రయోజనం కూడా బాగా చేకూరనుంది.ఇకపోతే ఈ ఏడాది జూన్లో చిన్న పథకాల వడ్డీ రేట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇక పెంచిన తర్వాత వడ్డీ రేట్లు జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్తించనున్నాయి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేసిన పథకాలపై ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. ఇక ఈ పథకాలు దేశంలోని ప్రైవేట్ అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎక్కువగా ఇస్తూ ఉండడం గమనార్హం. చాలాకాలం వరకు ఈ చిన్న పొదుపు పథకాల మీద ప్రభుత్వం ఎలాంటి వడ్డీరేట్లను పెంచలేదు. త్వరలోనే ఈ పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే చిన్న పొదుపు పథకాలపై ఎంత వడ్డీ రేట్లు పెంచారు అనే విషయం కూడా తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: