ప్రపంచం కరెన్సీ వెనుక పరుగులు తీస్తున్న కాలంలో ఉన్నాం. ఎటు చూసినా అంతా డబ్బుల కోసమే పోటీ, ఎంతున్నా ఎవరికి సరిపోవడం లేదు. లేని వాళ్ళు లేనట్టే మిగిలిపోతుంటే... ధనవంతులు ఇంకా సంపాదించాలి అంటూ పోటీలు పడి మరీ సంపాదిస్తున్నారు. అలా పెరిగి పెరిగి ఆ ధనం కాస్త చాలామంది చేతుల్లో నల్లదనంగా మారిపోతుంది. ఇపుడు ఇదే విషయం పై స్పెషల్ ఫోకస్ పెట్టగా అసలు విషయం బయట పడింది. అందులోనూ భారతీయుల బ్లాక్ మని బాగా పెరిగింది అని గణాంకాలు చెబుతున్నాయి. తాజా సర్వే ప్రకారం
స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్‌మనీ భారీగా పెరిగింది అని గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానన్న ప్రధాని మాటలు ఎటు పోయిందో తెలియదు కానీ … స్విస్‌ బ్యాంకుల్లో మన వాళ్ల నల్లధనం ఒక్క ఏడాదికే టన్నులు కొద్దీ పెరిగిందని తెలుస్తోంది.

గత ఏడాదికి ఈ ఏడాదికి నల్లదనం ఏకంగా 50 శాతం పెరిగింది అని లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు… 30వేల కోట్ల రూపాయలకు పైమాటేనని లెక్కలు తేల్చడం తో సామాన్యులు నివ్వెర పోతున్నారు. స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గణాంకాలతో ఈ విషయం నిజమేనని నిరూపితం అయ్యింది. అంతగా నల్లదనం భారం పెరిగింది అన్నమాట. స్విస్‌ బ్యాంక్‌ వెల్లడించిన తాజా లెక్కలు చూసి అంతా  అవాక్ అవుతున్నారు.  స్విస్‌ బ్యాంకుల్లోకి మన వాళ్ల సొమ్ము గతంలో కంటే వేగంగా తరలిపోతోందట.

మన దేశానికి చెందిన బడా బిజినెస్ మ్యాన్ లు, సంస్థలు స్విస్‌ బ్యాంక్‌ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతరతర  పత్రాల విలువ 2021 కి 30,500 కోట్లకు చేరినట్టు  స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం 14 ఏండ్ల గరిష్టం అంటే ఏ స్థాయిలో పెరిగింది అంటే అర్దం చేసుకోవచ్చు. తాజాగా స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌లు ఎస్‌ఎన్‌బీకి అధికారిక నివేదికలు అందించగా అందులో ఈ వివరాలు బయటకు వచ్చాయి.   అయితే ఈ భారీ మొత్తంలో నల్ల ధనం ఎవరెవరి ఖాతాల్లో ఉంది అన్న డేటా వివరాలు మాత్రం బయటకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: