ఆడపిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం కేంద్ర రాష్ట్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల్లో, ప్రైవేటు బ్యాంకులలో పోస్ట్ ఆఫీస్ లలో అందుబాటులో ఉన్న ఈ స్కీం ద్వారా ముందు నుంచే పొదుపు చేస్తూ ఉండడం వల్ల మీ ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చేసరికి వారి పెళ్లికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఓపెన్ చేయడం చాలా సులభం.


ఈ పథకం ద్వారా మీరు 7. 6% వడ్డీ కూడా పొందవచ్చు. అంతేకాదు ఆదాయపు పన్ను రాయితీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను రాయితీ ఉంటుంది. మీ అమ్మాయి వయసు 10 సంవత్సరాలలోపు ఉన్నప్పుడు ఖాతా తెరవచ్చు. 2019 డిసెంబర్లో నోటిఫికేషన్ ద్వారా ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు కూడా నోటిఫై చేయడం జరిగింది. ఇకపోతే ఈ పథకం కింద ఆడపిల్లల కోసం ఒక ఖాతా మాత్రమే తెరచడానికి వీలుగా ఉంటుంది. ఇక ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే రెండు ఖాతాలు తెరుచుకునే అవకాశం కల్పించబడింది.

ఇక కనిష్టంగా 250 రూపాయలతో ప్రారంభమయ్యే ఈ ఖాతా ఆ తర్వాత 50 గుణకారాలతో ఏదైనా మొత్తాన్ని మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరానికి రూ.1,50,000 మించకూడదని గుర్తుంచుకోవాలి. ఇక ఆడపిల్లలకు 21 సంవత్సరాలుగా సుకన్య సమృద్ధి పెట్టుబడి పథకం మెచ్యూర్ అవుతుంది. ఇకపోతే కుమార్తె వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం కోసం మీరు డబ్బు తీసుకోవచ్చు. ఇక పెళ్లికి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత ఖాతాను మూసి వేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: