
ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం, ధర్మారావు పల్లెకు చెందిన రైతులు పూల తోటల సాగు చేస్తూ చక్కగా లాభాలను పొందుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి బంతిపూల సాగు చేసి అధిక లాభాలను పొందుతున్నారు. మీ పొలంలో కానీ మీ ఇంటి దగ్గర స్థలం ఉన్నా సరే ఈ సాగు చేయవచ్చు. కేవలం పెట్టుబడి కింద పదివేలు పెడితే సరిపోతుంది. ఎలా చూసినా సరే ఖర్చులన్నీ పోగా రూ. 30 వేల వరకు మీకు ఆదాయం లభిస్తుంది.. మంచి ఆదాయం వచ్చే పంట కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇకపోతే బంతిపూల సాగు చేయడం వల్ల ఎకరానికి రెండు లక్షలు చొప్పున ఆదాయం కూడా లభిస్తుంది.
ఇక బంతిపూల సాగు చేసి మంచిగా డబ్బులు సంపాదించే వారికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా సహాయం అందిస్తోంది. మీ వద్ద పెట్టుబడికి డబ్బులు లేకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం అందించే రుణాలు తీసుకొని మీరు ఈ సాగు మొదలు పెట్టవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందాలి అంటే బంతిపూల సాగు చాలా మేలనే చెప్పాలి.