ప్రస్తుత కాలంలో నిరుద్యోగ యువత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోసం వెతుకులాడుతూ చాలామంది నిరాశ్రయులుగా మారుతున్నారు. అందుకే ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని మీరు వ్యాపారంగా మార్చుకుంటే కచ్చితంగా ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించవచ్చు. ఇకపోతే ఈ చక్కటి వ్యాపారం ప్రతినెలా మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక చక్కటి బిజినెస్ ఐడియాతో మేము మీ ముందుకు రావడం జరిగింది.

ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా కాఫీ తాగడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటున్నారు. ఇది రుచి కూడా బాగుండడంతో తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అందుకే చాలా మంది ఫిల్టర్ కాఫీతోనే బ్లాక్ కాఫీ కూడా తయారు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.  ముఖ్యంగా పెద్దపెద్ద సంస్థలు ఫిల్టర్ కాఫీ పొడిని ప్యాక్ చేసి విక్రయిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్యాక్ చేసినటువంటి కాఫీ పొడిలో సరైన ఆరోమా ఉండదు అప్పటికప్పుడు కాఫీ గింజలను పొడి చేయడం ద్వారా చక్కటి సువాసనను మీరు సొంతం చేసుకోవచ్చు .

ఇలా అప్పటికప్పుడు కాఫీ గింజలను పొడిచేసి ఆ పొడిని కాఫీగా తాగడానికి చాలామంది ఇష్టపడుతున్నారు కానీ అలా అప్పటికప్పుడు తయారుగం దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలు ఉంది రెగ్యులర్ కాఫీ గ్రైండింగ్ మెషిన్ ధర కూడా సుమారుగా రూ. 25 వేల వరకు ఉంటుంది మీరు ఇందులో కాఫీ గింజలను పొడి చేయవచ్చు అంతే కాదు కాఫీ పొడిని 100% ప్యూర్ గా ఎవరు విక్రయించరు కాబట్టి మీరు ఒకవేళ అలా విక్రయించినట్లయితే మీ లాభం రెట్టింపు అవుతుంది లేదా 70% కాఫీ పొడి కలిపి అందులో 30% చికరీ మిశ్రమాన్ని కలిపితే కూడా మంచి అరోమా వస్తుంది. ఒక కేజీ ధర రూ.300 వరకు ఉంటుంది దీనిని మీరు పొడి చేసి చికరి కలిపి విక్రయిస్తే దాదాపు 50 శాతం వరకు లాభం పొందవచ్చు. ఇంతకంటే ఆదాయం మరెక్కడా లభించదని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: