గ్యాంగ్ స్టర్, ఆషిక్ బనాయా ఆప్నే, అక్సర్, జన్నత్..వంటి సినిమాలతో బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌ అనే ట్యాగ్‌ను దక్కించుకున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. ఆయన సినిమాల్లో కంటెంట్ ఉన్నా లేకపోయినా కిస్సింగ్ సీన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఆయన్ను సీరియల్ కిస్సర్ అంటుంటారు. అయితే ఈ ట్యాగ్ తనకు చాలా బాధ కలిగిస్తుందని ఇమ్రాన్ ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. నేను ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూనే నా కెరీర్‌ను మలుచుకున్నాను. సినిమాల్లో నా పాత్ర ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఇప్పటి నుంచి మంచి చూపించే పాత్రల్లో నటించాలి. అలాంటి స్క్రిప్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నా. 

 

కానీ ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్స్ నా దగ్గరకి రానేలేదని ఫీలవుతున్నాడు. అయితే జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్‌లకు మాత్రం దేశభక్తుల్లా కనిపించే పాత్రలు దక్కుతుంటాయి. అందుకే ప్రజలు వారిని దేశభక్తులు అనుకుంటారు. కానీ నాకు మాత్రం ముందునుంచి కాపురాలు కూల్చే వ్యక్తిగా కనిపించే పాత్రలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తిగా కనిపించే పాత్రలు వచ్చాయి. అందుకే ప్రజలకు నా ముఖం చూడగానే వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు అనుకుంటారు. కానీ నిజజీవితంలో నేను చాలా మంచి వాడిని. కానీ ఈ విషయం ప్రజలు ఎవ్వరూ నమ్మరని  తన బాధను చెప్పకనే చెప్పాడు.

 

ప్రస్తుతం ఇమ్రాన్ 'ది బాడీ' అనే క్రైం థ్రిల్లర్ పాత్రలో నటించారు. ఇందులో వేదిక, శోభితా ధూలిపాల హీరోయిన్స్ గా నటించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ పోలీసు అధికారి పాత్రలో నటించడం విశేషం. ఇమ్రాన్ గురించి వేదిక మాట్లాడుతూ.. నిజానికి ఇమ్రాన్ చాలా మంచివాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ నాతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అయితే నాకు ఇమ్రాన్ గురించి వ్యక్తిగతంగా ఏమీ తెలీదు కానీ అతను చాలా మంచివాడు అని అర్థమైంది.. అన్నారు. ఆ తర్వాత ఇమ్రాన్ మాట్లాడుతూ.. కిస్సింగ్ సీన్స్‌లో నటించాల్సి ఉంటుంది. నీకు ఓకేనా అని వేదికను అడిగాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాబట్టి ఆమె ఏమీ అనుకోలేదు. బహుశా నాతో సినిమా అనగానే కొన్ని వరస్ట్ సీన్స్ ని ఊహించుకున్నట్లుంది.. అని చమత్కారంగా మాట్లాడాడు. మొత్తానికి ఇమ్రాన్ కి సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ అంత ఈజీగా పోదని అందరికి తెలిసిన విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: