టాలీవుడ్ లో అవకాశాల కోసం చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి చాలు అంటూ ప్రాధేయ పడుతున్నారు కొందరు. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు హీరోయిన్లు ఇక్కడ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న పరిచయాల ద్వారా అవకాశాల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వదిలి వెళ్ళే ప్రయత్నం చాలా మంది హీరోయిన్ లు చేయడం లేదు అనే విషయం కొన్ని రోజులుగా స్పష్టంగా అర్ధమవుతుంది. ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. 

 

ఈ మధ్య స్కిన్ షో, అలాగే లిప్ లాక్ సీన్స్ కి సినిమాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి తమకు ఒక్క అవకాశం ఇస్తే అవి చేయడానికి తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టంగా చెప్తున్నారు హీరోయిన్లు. అలాగే తాము బికినీ వేయడానికి కూడా రెడీ గా ఉన్నామని అగ్ర దర్శకులకు మెసేజ్ లు కూడా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అయితే అగ్ర దర్శకులు మాత్రం స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేయడానికి చూస్తున్నారు. ఒక మాదిరి హీరో అయినా సరే... స్టార్ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం వారిలో ఎక్కువగా వ్యక్తమవుతుంది. 

 

దీనితో కొత్తగా ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్లు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ లో ఏర్పడింది అనే చెప్పుకోవచ్చు. పారితోషికం కూడా తమకు అంత అవసరం లేదని తాము అంత డిమాండ్ చేయమని చెప్తున్నారట. అయినా సరే దర్శక నిర్మాతలు మాత్రం వారి మాట వినే ప్రయత్నం కూడా చేయడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. సినిమా ప్రచారం కూడా ఎక్కువగా చేస్తామని చెప్తున్నా సరే దర్శక నిర్మాతలు వినడం లేదని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తాము ప్రచారంలో కీలకంగా ఉంటామని చెప్పినా సరే నో అనే సమాధానమే వారికి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: