ప్రస్తుతం కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీతారలు అభిమానులను అలరించేందుకు రకరకాల పనులు చేస్తున్నారు.  అదే సమయంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్‌ కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్ కూడా ఉన్నాడు. డబ్బు సాయంతో పాటు ముంబైలోని తమ ఆఫీస్‌ బిల్డింగ్‌ను కరోనా  క్వారెంటైన్‌ సెంటర్‌గా వినియోగించుకునేందుకు ముంబై మున్సిపాలిటీకి ఇచ్చారు షారూక్ దంపతులు. నాలుగస్థుల ఈ బిల్డింగ్‌లో దాదాపు 25 మందిని క్వారెంటైన్‌ చేయోచ్చు.

 

తాజాగా బాలీవుడ్‌ తారలు అంతా కలిసి ఫండ్ రైజింగ్‌ కోసం ఓ వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విర్చ్యువల్‌ కన్సర్ట్ పేరుతో హిందీ సినీ తారలంతా పాటలు పాడుతూ ఐ ఫర్‌ ఇండియా పేరుతో డొనేషన్‌ కలెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా షారూఖ్‌ ఖాన్‌ కూడా తనలో పాటగాడిని బయటకు తీశాడు. తన ఇంట్లోని ఆఫీస్‌ రూంలో ఉండి లైవ్‌ కన్సర్ట్‌లో పాల్గొన్నాడు. అయితే షారూఖ్‌ పాట పాడుతుండగా ఆయన వెనక ఉన్న ఆఫీస్‌ ఇంటీరియర్ డెకరేషన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

 

షారూఖ్‌ పాట పాడుతున్న వీడియోలో వెనక ఒక పక్క ముస్లిం మత గ్రంథం ఖురాన్ కనిపిస్తుండగా మరో పక్క గణపతి విగ్రహం ఉంది. షారూఖ్‌ ఖాన్‌ ముస్లిం అన్న సంగతి అదంరికే తెలిసిందే. ఆయన హిందువైన గౌరీని లవ్ మ్యారేజ్‌ చేసుకున్నాడు. అందుకే కింగ్ ఖాన్‌ ఇంట్లో రెండు మతాలకు సంబంధించిన ఫెస్టివల్స్‌ను సెలబ్రేట్‌ చేస్తుంటారు. తాజాగా షారూఖ్‌ ఆఫీస్‌ రూంలో వినాయక విగ్రహం కూడా ఉండటంపై అభిమానులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: