పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోపాల గోపాల మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా మరో కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గోపాల గోపాల’ సినిమాలో దేవుడిగా కనిపించనున్నాడు. అలాగే ఈ మూవీ తరువాత తన అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2 లోనూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రోల్ చేయనున్నాడు. ఈ రెండు మూవీల తరువాత పవన్ డివోషనల్ ఓరియంటెడ్ మూవీని చేయనున్నాడు. దీనికి సంధించిన క్లియర్ టాక్స్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. పవన్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల షూటింగ్ అనంతరం, ఈ ప్రాజెక్ట్ కి చెందిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. వెంకటేష్ , పవన్ కళ్యాణ్ ఇద్దరూ గోపాల గోపాల మూవీలో స్క్రీన్ స్పేస్ ని పంచుకోగా, పవన్ కళ్యాణ్ నటించబోతున్న ఆ డివోషనల్ మూవీలో వెంకటేష్ ప్రత్యేక పాత్రను పోషించే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ తరువాత మరో కమర్షియల్ మూవీలో నటిస్తాడనుకుంటే, అందరి ఆలోచనలకి అందకుండా డివోషనల్ రోల్స్ ను ఎంచుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న గోపాల గోపాల మూవీ బిజినెస్ కి సంబంధించిన మార్కెట్ ఊపందుకుందుకుందని, ఈ మూవీ నైజాం రైట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్ సొంతంగా రిలీజ్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించబోతున్న డివోషన్ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: