శర్వానంద్ లో చాలమంచి నటుడు ఉన్నాడని అందరికి  తెలుసు. ఆయన మొదట్లో హిట్స్ లేకపోయినా కూడా రన్ రాజా రన్ సినిమా తర్వాత శర్వానంద్ కెరీర్ మారిపోయింది . ఆ సినిమా తర్వాత వరస హిట్స్ తో  శర్వానంద్ దూసుకెళ్లాడు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ,మహానుభావుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ట అవ్వడంతో ఇక శర్వానంద్ కి తిరుగులేదు అనుకున్న టైంలో వరుసగా 3 ప్లాప్స్ వచ్చేయ్.  అందులో పడి పడి లేచే మనసు, భారీ అంచనాలతో వచ్చిన రణరంగం, ఇంకా సమంత కలిసి నటించిన జాను సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు 96 సినిమా  శర్వానంద్ రీమేక్ చేశారు.ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ వినిపించిన కూడా ఈ సినిమా స్లో గా ఉండడంతో ఆడియన్స్ సినిమా తిప్పికొట్టారు. అయితే శర్వానంద్ ఇప్పుడు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న శ్రీకారం సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు . ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు కి మరియు టీజర్ కు చాలా మంచి స్పందన వస్తుంది . ముఖ్యంగా వస్తానంటివో పోతానంటివో  సాంగ్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా వెంటనే శర్వానంద్ మహాసముద్రం సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాని ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే శర్వానంద్ ఈ రెండు సినిమాల మీద తన ఆశలు పెట్టుకున్నాడు .ఇక శ్రీకారం సినిమా మార్చి లో విడుదల కాబోతుంది ఈ సినిమా ఎంత రేంజ్ లో హిట్ అవుతుందో విడుదల వరుకు వేచి చూడాలి. ఈ సినిమాలో శర్వానంద్ ఒక రైతుగా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: