మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం నుంచి నిన్న తొలి పాట విడుదలైంది. "లాహే లాహే"... అంటూ సాగిన ఈ పాటకు మణిశర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి పాడిన ఈ పాట ట్యూన్, అలానే సాహిత్యం రెండూ ఇప్పటి జానపద గీతాల ట్రెండ్ కు దగ్గరగానే  ఉన్నాయి. అయితే ఈ పాటలో చిరంజీవి డాన్స్ వేస్తున్నట్టు ఉంటుంది. దీంతో ఇప్పుడు ఈ పాట మీద కొందరు ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాలో తాను నక్సలైట్ పాత్రలో నటిస్తున్నానని చిరంజీవి పేర్కొన్న నేపథ్యంలో ఈ ట్రోలింగ్ మొదలు అయిందని చెప్పచ్చు. 

అదేమంటే నక్సలైట్లు ఇలా గుళ్ల ముందు డ్యాన్స్ చేస్తారా, ఖరీదైన చొక్కాలతో కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వేసుకున్న హీరోయిన్ తో కలిసి గెంతులు వేస్తారా అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఈ వయసులో మంచి పాత్రలు స్ఫూర్తిని ఇచ్చే సినిమాలు చేసుకోక ఈ హీరోయిజం ఎలివేషన్ సినిమాలు ఏమిటి అంటూ వారు ట్రోల్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇలా ట్రోల్ చేయడం ఏమాత్రం సరికాదని అంటున్నారు. అసలు సినిమా కథేంటో తెలియదు, 

ఈ పాట ఏ సందర్భంలో వస్తుందో తెలియదు అలానే ఈ పాట సాహిత్యాన్ని ఒకటికి రెండుసార్లు వింటేగానీ ఒక అంచనాకు రాలేనంత క్లిష్టంగా ఉందని, దానికి మీరెలా ట్రోలింగ్ చేస్తారని మరి కొందరు అంటున్నారు. కమర్షియల్ ఫ్లేవర్ కోసమే కాస్త రిచ్ లుక్ ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు. మరి ఈ ట్రోలింగ్ వ్యవహారం ఎండాకా వెళ్తుందో చూడాలి మరి. 'ఆచార్య' సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపిస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా మే 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: