అయితే మొదట ఓ సినిమాలో నటించిన ఇద్దరు వ్యక్తులు ...ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ప్రేమ జంటగా కూడా నటించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అలా కలసి కొంత కాలం సినీ ప్రయాణం చేసిన ఆ జంట ప్రేమ వివాహం చేసుకోవడం. మళయాళ నటుడు జయరాం సుబ్రహమణ్యం ..తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. అల వైకుఠ పురములో చిత్రంలో అల్లు అర్జున్ ఒరిజినల్ తండ్రిగా నటించిన విషయం తెలిసిందే. తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో ఈయన నటించారు. కమలహాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పంచతంత్రం సినిమాలో అయిదుగురు స్నేహితుల్లో జయరాం కూడా ఒక స్నేహితుడిగా నటించారు. ఆ సినిమా అప్పట్లో ఎంతో గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళం కలిపి సుమారు 200 చిత్రాల్లో నటించారు జయరాం.
ఇక ఈయన భార్య కూడా ఒకప్పటి హీరోయిన్. ఆమె మరెవరో కాదు పార్వతి. జయరాం కంటే ముందు సినీరంగ ప్రవేశం చేసిన ఈమె జయరాం మొదటి చిత్రం అపారం మూవీలో ఆయనకి చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా కూడా చేశారు. అలా వీరి సినీ జర్నీలో కలిసిన వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు కాళిదాస్ జయరాం, ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. కుమార్తె మాళవిక జయరాం ఈమె మోడల్ గా కెరియర్ ని ఆరభించింది. ఓ సినిమాకు ఈమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా తన మొదటి సినిమాలో పార్వతికి అన్నగా నటించిన జయరాం...నిజ జీవితంలో పార్వతిని పెళ్ళాడి సంతోషంగా వారి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.