టాలీవుడ్లో ఒక్కొక్కసారి మంచి సక్సెస్ ట్రాక్ మెయింటైన్ చేసిన దర్శకులు ఉన్నఫలంగా ఫ్లాప్ లు వచ్చి కనిపించకుండా పోతారు. స్టార్స్ తో సినిమాలు చేసిన హీరో తో సినిమా చేసే అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఇక్కడ సక్సెస్ ట్రాక్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఫ్లాప్ పడిందా అప్పటి వరకూ ఉన్న సక్సెస్ ను ఎవరూ చూడరు. మీ లాస్ట్ సినిమా పెద్ద ఫ్లాప్ కదా.. అనే దగ్గర ఆగిపోయి మళ్ళీ కలుద్దాం.. చూద్దాం.. ఆల్రెడీ వేరే కమిటైన ప్రాజెక్ట్ లు ఉన్నాయి అనే  డైలాగులతో మొహం చాటేస్తారు హీరోలు.

ఇలాంటివన్నీ ఫేస్ చేసిన డైరెక్టర్ మళ్లీ తమ సత్తా చాటాలని కసితో కథలు రాసుకుని ప్రాజెక్ట్ దక్కించుకుని హిట్ లు కొట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇది ఓ పెద్ద అగ్ని పరీక్ష. దీన్ని దాటుకొని వచ్చిన చాలామంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లు గా ఉన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇద్దరు దర్శకులు..  వారే బొమ్మరిల్లు భాస్కర్, కరుణాకరన్. పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ సినిమా తీసిన కరుణాకర్ భారీ హిట్ ను అందుకునీ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

పవన్ కళ్యాణ్ కి మైల్ స్టోన్ లాంటి సినిమాలు ఇచ్చి ఆ తర్వాత వాసు, యువకుడు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, తేజ్ ఐ లవ్ యు వంటి సినిమాలు చేశాడు. అయితే ఈ సినిమాలలో ఏవీ మినిమం రేంజ్ లో కూడా ఆడకపోవడంతో క్రమక్రమంగా ఆయన క్రేజ్ తగ్గిపోయింది. ప్రస్తుతం మినిమం రేంజ్ ఉన్న హీరోలు కూడా ఆయన తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బొమ్మరిల్లు సినిమా తో సూపర్ హిట్ కొట్టి ఓ ట్రెండ్ సృష్టించిన భాస్కర్సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని బొమ్మరిల్లు భాస్కర్ అయ్యాడు. ఆ తరువాత ఆరెంజ్, పరుగు, ఒంగోలుగిత్త చేశాడు. ఇవి దారుణమైన ఫ్లాప్ ఎదుర్కోవడంతో ఆయనను ఏ హీరో పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత అఖిల్ హీరోగా మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ అనే సినిమా తో రెడీగా ఉన్నారు. మరి ఈ సినిమాతో అన్న హిట్ కొడితే ఆయనను హీరోలు పట్టించుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: