తెలుగు ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న  చిన్మయి శ్రీపాద నిత్యం ట్రోలింగ్ కు గురిఅవుతూనే ఉంటారు. మహిళల కోసం పాటుపడే ఈమెకు కొంతమంది ఫెమినిస్ట్ అనే ముద్ర కూడా వేసేశారు. మామూలుగా వెనుకబాటుతనం, వివక్ష ఎక్కడ కనిపించినా చిన్మయి స్పందిస్తుంటారు. మహిళలకు జరిగే తప్పులను కూడా ఈ సింగర్ వేలెత్తి చూపుతుంటారు. చిన్మయి ఎక్కువగా గా మహిళలకు జరిగే అవమానాలు, అత్యాచారాలపై కామెంట్ చేస్తూ ఉంటారు.


 అలా మొగవారి అకృత్యాలపై చిన్మయి ఎప్పుడు స్పందిస్తుంటారు. అలాంటి ఈ సింగర్ సోషల్ మీడియాలో ఎప్పుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురి అవుతూనే ఉంటుంది. కాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ ఆమధ్య చిన్మయి పెద్ద ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. వైరముత్తు లాంటి వ్యక్తిని ఢీకొట్టారు. కొలీవుడ్ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడు అంటూ ఈ సింగర్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారానికి దారి తీశాయి మన అందరికీ తెలిసిందే. అలా కోలీవుడ్లో వైరముత్తు, రాధా రవి ఇలాంటి వారితో సై అంటే సై అనే రేంజ్ లో  చిన్మయి శ్రీపాద పోరాడుతూ వస్తున్నారు. అలాంటి చిన్మయికి సోషల్ మీడియా లో ఒక వర్గం నుండి మద్దతు లభిస్తుంటే మరో వర్గం నుండి అదేస్థాయిలో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటుంది.


 ఇదిలా ఉండగా తాజాగా ఓ నెటిజన్ ఈ సింగర్ ను చాలా దారుణంగా దూషించాడు. ఏ విషయానికి సంబంధించి నెటిజన్ అలా అన్నాడు తెలియదు కానీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను శ్రీపాద తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్టులో  నీకు మహిళ గా ఉండడం అంత సమస్యగా ఉన్నట్లయితే లింగమార్పిడి చేసుకో, ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు వెళ్ళి పడుకో, నీ ఆపరేషన్ డబ్బులన్నీ వెనక్కు వస్తాయి, నీలాంటి వారు మగ జాతి కి వ్యతిరేకం, మీలాంటివారు సమాజానికి ప్రమాదం.ఇలాంటి పనులు చేసి మీరు మంచి పేరు సాధించాలని చూస్తుంటారు. నీలాంటి వాళ్ల కంటే అడుక్కుతినే వాళ్ళు చాలా రెట్లు నయం అని రెచ్చిపోయాడు. పొద్దు పొద్దున్నే ఇలాంటి మెసేజ్ లు పెట్టేసాడు. ఓ మనిషి నేర్పించిన గుణపాఠం ఇది అని చిన్మయి శ్రీపాద చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: