మహేష్ బాబు తండ్రి కృష్ణ కి రెండు పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసిందే. మొదటి భార్య ఇందిరాదేవి కాగా రెండవ భార్య విజయ నిర్మల. మొదటి భార్యతో రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, పద్మావతి, ప్రియదర్శిని ఐదుగురు సంతానం కన్న తరువాత సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే పెళ్లయిన విజయనిర్మల ను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యి ఓ సంతానం కూడా ఉంది. ఆయన ఎవరో కాదు ఇప్పటి సీనియర్ నటుడు నరేష్.

అయితే విజయ నిర్మల ను పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ ఇందిర నీ కానీ ఆమె పిల్లలను కానీ ఏ మాత్రం దూరం పెట్టలేదు. అందరినీ ఒకేలా చూసుకున్నాడు. పిల్లలకి ఏమాత్రం లోటు లేకుండా చూసుకున్నాడు.  అయితే విజయనిర్మల తో కృష్ణ కి పెళ్లి అయిన తరువాత ఇందిరా దేవి కృష్ణతో కలిసి ఉండటం ఎప్పుడూ కనిపించలేదు. దాంతో ఆమె ఎంతగా ఫీల్ అయ్యింది అర్థం చేసుకోవచ్చు.  కృష్ణ, విజయ నిర్మల సంతానం కు కూడా ఆ తర్వాత సంతానం కలిగలేదు. అంతేకాదు నరేష్ కూడా మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి మెలిసి ఉండడం మనం పలు సార్లు చూశాం. దాంతో వారు ఎంత అన్యోన్యత తో ఉన్నారో  అర్థం చేసుకోవచ్చు.

ఇక వీరితో పాటే మనం విజయలలిత గురించి చెప్పుకోవాలి. ఆమె ఎవరో కాదు విజయనిర్మల ఆడపడుచు. జయలలిత అన్నయ్య అయినటువంటి కెఎస్ మూర్తి చెల్లె.  అలాగే విజయలలిత స్వయంగా విజయ శాంతి కి పిన్ని వరస అవుతుంది అంటే విజయలలిత అక్క కూతురు విజయశాంతి అన్న మాట. అలా విజయశాంతి స్వయంగా మహేష్ బాబుకు వదిన అవుతుంది. విజయనిర్మల,విజయ లలిత, విజయశాంతి ఈ ముగ్గురు ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపారు. మహేష్ బాబు కు  విజయశాంతి వదిన వరస అవుతుంది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: